ఇటీవలే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంత ఉత్కంఠ మధ్య జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో చివరికి నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో భాగంగా చివరి ఓవర్ లో ఎన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అంపైర్లు  నోబాల్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. అదే సమయంలో ఇక ఎంపైర్లు ఇచ్చిన ఫ్రీ హిట్ కూ విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోగా ఇక ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరించిన కోహ్లీ మూడు పరుగులు పిండుకున్నాడు.


 దీంతో అందరూ ఆశ్చర్యపోయారు అని చెప్పాలి. అయితే ఇక ఇలా విరాట్ కోహ్లీ ఒకవైపు ఫ్రీ హీట్ కి పరుగులు తీస్తూ ఉంటే మరోవైపు పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఒకసారిగా అవ్వక్కయ్యారు. ఇక ఆ తర్వాత ఎంపైర్ల దగ్గరికి వెళ్లి ఇదే విషయంపై చర్చలు జరిపారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇదే విషయంపై అటు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది పాకిస్తాన్ మాజీ ఆటగాళ్లు ఇదే విషయంపై స్పందిస్తూ ఇక అటు అంపైర్ల నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.


 ఇటీవల ఇదే విషయంపై స్పందించిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఏకంగా తమ దేశ ఆటగాళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. వరల్డ్ కప్ లో భాగంగా ఇండియాతో జరిగిన మ్యాచ్లో తమ దేశ ఆటగాళ్లు శ్రద్ధగా ఆడలేదని.. కనీసం వారికి రూల్స్ కూడా తెలియవు అంటూ సల్మాన్ బట్ విమర్శించారు. అంపైర్ ప్రకటించిన నోబాల్ సరైన నిర్ణయమే.. ఫ్రీ హిట్ సమయంలో రన్ అవుట్, బంతిని చేతితో ఆపడం లేదా ఫీల్డింగ్ ని అడ్డుకోవడం చేస్తే వికెట్ గా పరిగణిస్తూ ఉంటారు.  కానీ ఫ్రీ హిట్ ను వృధా చేయకుండా భారత ఆటగాళ్లు ఎంతో తెలివిగా పరుగులు తీస్తే పాకిస్తాన్ ఆటగాళ్లు మాత్రం అంపైర్తో వాగ్వాదానికి దిగారు అంటూ సల్మాన్ బట్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: