భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ అటు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో ఎలాంటి చెత్త ప్రదర్శన చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టి20 ఫార్మాట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న సూర్యకుమార్ యాదవ్ అటు వన్డే ఫార్మాట్లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. వరుసగా మూడు మ్యాచ్ లలో కూడా డకౌట్ కావడం అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోయారు అన్న విషయం తెలిసిందే. అది కూడా ఆడిన మొదటి బంతికే డక్ ఔట్ అయ్యి వెనుతిరిగాడు సూర్య కుమార్ యాదవ్.


 దీంతో సూర్యకుమార్ యాదవ్ చెత్త రికార్డు మూట గట్టుకున్నాడని ఇక అతను వన్డే ఫార్మాట్ కు సరిపోడని.. కేవలం టి20 ఫార్మాట్లోనే కొనసాగించాలి అంటూ ఎంతో మంది విమర్శలు చేయడం కూడా చూసాము. ఇలా వరుసగా మూడు మ్యాచ్ లలో డక్ ఔట్ కావడం లాంటి చెత్త రికార్డు  ఏ ఆటగాడికి సాధ్యం కాదు అని ఎంతోమంది  విశ్లేషకులు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ సూర్య కుమార్ ని మించిన చెత్త రికార్డు ఇక ఇటీవల నమోదయింది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.  పాకిస్తాన్ ఆటగాడు మూడుసార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు డక్ అవుట్ అయ్యి చెత్త రికార్డు నమోదు చేశాడు. పాకిస్తాన్ ప్లేయర్ అబ్దుల్లా షపీక్ టీ20 లో వరుసగా నాలుగు మ్యాచ్లలో డక్ అవుట్ అయ్యాడు. అయితే ఇలా టి20 ఫార్మాట్లో వరుసగా నాలుగు మ్యాచ్ లలో డకౌట్ అయిన తొలి ఆటగాడిగా నిలిచాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండు టీ20లలో రెండో బంతికే డక్ అవుట్ అయిన అతను.. ఆఫ్గనిస్తాన్ తో జరిగిన సిరీస్ లో మొదటి మ్యాచ్ లో రెండో బంతికి ఇక రెండో మ్యాచ్ లో మొదటి బంతికి డకౌట్ గా వెనుతిరిగాడు. ఇలా వరుసగా నాలుగు డక్ ఔట్లు అయినా మొదటి ప్లేయర్గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి సూర్య కంటే ఇతను మరీ దారుణంగా ఉన్నాడు అని క్రికెట్ ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: