సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం సర్కారు వారి పాట అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా ... పరుశురాం పెట్ల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సముద్ర ఖనిమూవీ లో ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2022 మే 12 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో మూడు సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి ఈ సినిమా విడుదల అయ్యి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఈ మూవీ స్టార్ట్ కావడానికి ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం గురించి తెలుసుకుందాం.

సర్కారు వారి పాట సినిమా కంటే ముందు పరుశురాం , విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా గీత గోవిందం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో పరుశురాం క్రేజ్ ఒక్క సారిగా అమాంతం పెరిగిపోయింది. గీత గోవిందం సినిమా తర్వాత పరుశురాం , మహేష్ బాబుతో కాకుండా నాగ చైతన్య తో ఓ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగా పరుశురాం , నాగచైతన్య కలిసి కొంత కాలం ట్రావెల్ కూడా చేశారట. ఇక ఆల్మోస్ట్ పరుశురాం , చైతూ కాంబోలో సినిమా ఫిక్స్ అయింది అని వార్తలు వస్తున్నా సమయంలో పరశురాం కు మహేష్ బాబు నుండి సినిమా ఆఫర్ వచ్చిందట. ఈ విషయం నాగ చైతన్య కు తెలియడంతో చైతన్య కూడా మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో సినిమా అవకాశం రావడం గొప్ప విషయం. మీరు మొదట మహేష్ తో సినిమా చేయండి. ఆ మూవీ పూర్తి అయిన తర్వాత మనిద్దరం కలిసి సినిమా చేద్దాం అని పరశురాం కి చెప్పాడట. దానితో చైతూ తో సినిమాను పక్కన పెట్టి పరశురాం , మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే టైటిల్ తో మూవీ ని రూపొందించాడట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mb