బంగ్లాదేశ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఇండోర్ వేదికగా ఈ రోజే మొదలైంది. టీ ట్వంటీ సిరీస్ గెలిచి జోష్ మీదున్న టీ ఇండియా అదే ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇండియా ధాటికి బంగ్లాదేశ్ కుదేలైంది. కేవలం ఒక్కరోజు కూడా ఆట పూర్తిగా ఆడకుండా పది వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా జట్టులో ఓపెనర్లు ఏమంత రాణించలేదు. మన పేసర్ల ధాటికి బంగ్లా బ్యాట్స్ మెన్ విలవిల లాడిపోయారు.  ఓపెనర్లు తొందరగా వెనుదిరగడంతో భారం కెప్టెన్ మీద పడింది. 


బంగ్లా సారధి మోమిల్ 80 బంతులాడి 37 పరుగులు చేయగలిగాడు.  ఆ తర్వాత ముస్తాఫికుర్  రహీమ్ 43 పరుగులు చేసి బంగ్లాకి ఆ మాత్రం స్కోరునైనా తీసుకురాగలిగాడు. మిగతావాళ్ళలో ఎవ్వరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేకపోయారు. కనీసం వికెట్ పడకుండా ఆపలేకపోయారు. మొత్తానికి నూట 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక భారత పేసర్లకి ఇండోర్ పిచ్ బాగా కలిసొచ్చింది.

ఇషాంత్ శర్మ 12 ఓవర్లు వేయగా అందులో 6 మెయిడెన్ ఉండడం విశేషం. అదీగాక రెండు వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక ఉమేష్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అందరికంటే ఎక్కువగా పేస్ బౌలర్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆలౌట్ అయిన తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు రోహిత్ శర్మ రూపంలో ఒక వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ లో కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అబు జయేద్ బౌలింగ్ లో లిటన్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


రోహిత్ శర్మ బ్యాటింగ్ మెరుపులు చూద్దామని అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్, చతేశ్వర పుజారా క్రీజులో ఉన్నారు. మ్యాచ్ ముగిసే సమయానికి మయాంక్ అగర్వాల్ 81 బంతుల్లో 37 పరుగులు చేయగా, ఛతేశ్వర పుజారా 61 బంతుల్లో 43  పరుగులు చేయగలిగారు.



మరింత సమాచారం తెలుసుకోండి: