న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా వరుస పరాజయాలతో సతమతమవుతోంది. టీ-20 సిరీస్‌ను 5-0తో వైట్ వాష్ చేయడం మినహాయిస్తే భారత్ కు మరో విజయం దక్కలేదు. వన్డేల్లో మూడింటికి మూడు మ్యాచ్ ల్లో ఓటమిపాలయ్యారు. తొలి టెస్టులోనూ చేతులెత్తేశారు. వెల్లింగ్టన్ పిచ్ పై పేస్, బౌన్స్ కు దాసోహం అన్నారు. ఇప్పుడు రెండో మ్యాచ్‌కి రెడీ అయ్యారు. రేపు క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్‌తో అమీతుమీ తేల్చుకోనుంది కోహ్లీసేన.

 

న్యూజిలాండ్‌తో రెండు టెస్ట్‌ల సిరీస్‌లో ఫస్ట్‌ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది టీమిండియా. ప్రత్యర్థి పేస్ ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా సిరీస్‌లో 0-1తో వెనుకంజలో నిలిచారు. దీంతో రెండో టెస్ట్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారు. ఇప్పుడు సిరీస్‌ను సమం చేయడానికి టీమిండియా సిద్దమవుతోంది. హాగ్లే ఓవల్ పిచ్‌లో ఇప్పుడు రెండో టెస్ట్‌కి రెడీ అయింది.

 

బ్యాటింగ్, బౌలింగ్ వైఫల్యాలతో ఫస్ట్‌ టెస్ట్‌లో ఓడిన టీమిండియా ఇప్పుడు క్లీన్‌స్వీప్ ముప్పు ముంగిట నిలిచింది. సిరీస్‌ని సమం చేయక తప్పని పరిస్థితుల్లో నిలిచింది. ఫస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ కివీస్‌ పేస్‌ ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్రాక్టీస్‌ ముమ్మరం చేసింది. ఓపెనర్లలో మయాంక్‌ అగర్వాల్‌ ఫర్వాలేదనిపించినా.. యంగ్‌ బ్యాట్స్‌మెన్‌ పృధ్వీషా ఘోరంగా విఫలమయ్యాడు. పుజారా, కోహ్లీలు కూడా సత్తా చాటలేకపోయారు. రహానే ఒక్కడే కివీస్‌ బౌలింగ్‌ను సమర్ధంగా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు వీరంతా రాణిస్తేనే ఈ మ్యాచ్‌లో టీమిండియా నిలబడగలదు.

 

బౌలింగ్‌ విభాగంలోనూ టీమిండియా అంతగా ఆకట్టుకోలేదు. బుమ్రా, షమీ అంతగా రాణించలేకపోయారు. లంబూ ఇషాంత్‌ శర్మ ఒక్కడే ఐదు వికెట్లు తీసి సత్తా చాటాడు. పేస్‌ పిచ్‌ ముందు స్పిన్నర్‌ అశ్విన్‌ తేలిపోయాడు. దీంతో టీమిండియా బౌలింగ్‌కు రెండో టెస్ట్‌ పెద్ద సవాల్‌ కానుంది. మరోవైపు కివీస్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండు విభాగాల్లో సత్తా చాటి సూపర్‌ ఫామ్‌లో ఉంది. విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ బ్యాటింగ్‌లో సత్తా చాటుతుంటే.. సౌధీ, బౌల్ట్‌, జేమీసన్‌ బౌలింగ్‌లో విజృంభిస్తున్నారు. రెండో టెస్ట్‌కి మరో పేసర్‌ నీల్‌ వాగ్నర్‌ అందుబాటులోకి రానున్నాడు. దీంతో కివీస్‌ బౌలింగ్‌ మరింత స్ట్రాంగ్‌గా మారింది.

 

మ్యాచ్‌ జరిగే హాగ్లే ఓవల్‌ పిచ్‌ పిచ్ మరింత పచ్చికతో కళకళలాడుతోంది.  ఈ మ్యాచ్‌లోనూ టీమిండియాకు పేస్‌ నుంచి సవాల్‌ ఎదురుకానుంది. టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌లో టాప్‌ పోజిషన్‌ను మరింత స్ట్రాంగ్‌గా మార్చుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. దీంతో ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: