బీసీసీఐ  ప్రతి ఏడాది ఐపీఎల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది అన్న  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో భారత ఆటగాళ్లతో పాటు ఎంతో మంది విదేశీ ఆటగాళ్లు కూడా సహచరులుగా మారిపోయి మ్యాచ్ ఆడుతూ ఉండడంతో క్రికెట్ మజా మరింత పెరిగి పోతూ ఉంటుంది. ఇకపోతే ఒక ఐపీఎల్ సీజన్ లో బాగా రాణించని ఆటగాళ్లను ఆ తర్వాత సీజన్లలో ఫ్రాంచైజీలు వదిలిపెట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి  అన్న విషయం తెలిసిందే. ఈ  ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ లో మాత్రం ఆయా ఫ్రాంచైజీలు ఏకంగా జట్ల లోని కీలక ఆటగాళ్లను  వదిలిపెడుతూ  ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది.



 గత ఏడాది చివర్లో ఐపీఎల్ జరుగగా ప్రస్తుతం ఈ ఏడాది వేసవిలో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించి ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టింది అన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తుంది బిసిసిఐ. ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో మినీ వేలం నిర్వహించేందుకు నిర్ణయించిన బీసీసీఐ  ఇందుకోసం ఫ్రాంచైజీలు తమ తమ జట్టు నుంచి రివీల్ చేసే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాలి అంటూ కోరింది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా తమ జట్ల  నుంచి వదులుకునే  ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఈ క్రమంలోనే కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఏరికోరి కొనుగోలు చేసిన సీనియర్ ఆల్రౌండర్ మాక్స్వెల్ ను జట్టు చివరికి వదులుకుంది.



 దాదాపు 11 కోట్లు వెచ్చించి మ్యాక్స్వెల్ ను కొనుగోలు చేసింది జట్టు యాజమాన్యం. ఎంతో నమ్మకం పెట్టుకుంది. కానీ సిక్సుల వీరుడు గా పేరు పొందిన మాక్స్వెల్ గత ఏడాది ఐపీఎల్ సీజన్ లో ఒక్క సిక్స్  కూడా కొట్టక పోవడం గమనార్హం. 12 మ్యాచ్ లలో   అవకాశం ఇస్తే కేవలం 102 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టులో మాత్రం అద్భుతంగా రాణించాడు అని చెప్పాలి. అయినప్పటికీ మాక్స్వెల్ ఆటతీరుపై నమ్మకం కోల్పోయిన జట్టు యాజమాన్యం అతని ని  వదిలేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ దిగ్గజ ఆటగాడి ని ఎవరు సొంతం చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: