2022 టీ 20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ లోనే ఇంటిదారి పట్టిన రెండు జట్లు ఇండియా మరియు న్యూజిలాండ్. మొదటి సెమీఫైనల్ లో న్యూజిలాండ్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి మరోసారి వరల్డ్ కప్ లో నిరాశను మిగిల్చింది. ఇక టైటిల్ ఫేవరెట్ గా భావించిన ఇండియా సైతం కీలకం అయిన సెమీఫైనల్ 2 లో ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయి కనీసం పోటీ ఇవ్వకుండా దారుణంగా కోట్లాది మంది అభిమానులను నిరాశపరిచింది. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆడుతున్న మొదటి సిరీస్ న్యూజిలాండ్ తోనే, ఇందులో భాగంగా మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే లకు షెడ్యూల్ ఉంది. టీ 20 సిరీస్ ను ఇండియా 1-0 తో గెలుచుకుంది.

మొదటి మ్యాచ్ మరియు మూడవ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకపోవడం తో రెండవ మ్యాచ్ లో గెలిచిన టీం ఇండియా సిరీస్ ను కైవసం చేసుకుంది. అలా వర్షం కారణంగా అసంతృప్తిగా సిరీస్ ముగిసింది. ఇక వన్ డే సిరీస్ లో ఆరంభ మ్యాచ్ లో న్యూజిలాండ్ అన్ని విభాగాలలో అద్భుతంగా రాణించి 10 వికెట్ల తేడాతో ఇండియాను ఓడించి సిరీస్ లో 1-0 తో మెరుగైన స్థానంలో నిల్చింది. ఇక నిన్న జరగాల్సిన రెండవ వన్ డే లో కేవలం ఒక ఇన్నింగ్స్ లో 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం అయింది. మరోసారి టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ తీసుకుంది, కానీ వర్షం కారణంగా పదే పదే ఆగిన మ్యాచ్ ను చివరికి  అంపైర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇప్పటి వరకు ఈ సిరీస్ లో మొత్తం 5 మ్యాచ్ లు జరుగగా, అందులో మూడు మ్యాచ్ లు వర్షం వలన అటు ప్రేక్షకులు ఇటు ప్లేయర్స్ ఇద్దరూ బాధపడ్డారు. ఎంతో కష్టపడి ఐసీసీ ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ లో వర్షం వలన రద్దు కావడం అన్నది చాలా బాధాకరం. ఇక ఆఖరి మరియు మూడవ వన్ డే బుధవారం రోజున జరగనుంది. కనీసం ఈ మ్యాచ్ అయినా సక్రమంగా జరుగుతుందా లేదా వర్షం అడ్డంకిగా మారుతుందా అన్నది చూడాలి. ఒకవేళ మ్యాచ్ వర్షం వలన రద్దు అయితే సిరీస్ న్యూజిలాండ్ వశం అవుతుంది.      


మరింత సమాచారం తెలుసుకోండి: