ఇటీవల కాలంలో ప్రతి ఒక్క దానికి జీ-మెయిల్ చాలా అవసరం పడుతుంది. నిత్యం ఏదో ఒక వెబ్సైట్ నుంచి ఈ జీ మెయిల్ కు ఈ- మెయిల్ రావడం మనం చూసే ఉంటాం. అయితే మనకు అవసరం లేని ఈ మెయిల్స్ కూడా ఈ జీ- మెయిల్ కి వస్తూ , మొబైల్ లో ఉన్న స్టోరేజ్ ను కాస్త పూర్తి చేస్తూ ఉంటాయి. అందుకే ఈ జీ - మెయిల్ యూజర్లు చాలామంది స్టోరేజ్ తక్కువ అవడంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ జీమెయిల్లో మనం ఈ - మెయిల్స్ ను కేవలం 50 లేదా 100 ..అంతకంటే ఎక్కువ మెయిల్స్ ను ఒకేసారి డిలీట్ చేయడం కుదరదు. కానీ ఇప్పుడు చెప్పబోయే చిన్న ట్రిక్ తో మీరు ఒకేసారి కొన్ని వేల ఈ - మెయిల్స్ ను కూడా ఒకేసారి క్లియర్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకవేళ మీ జీ- మెయిల్ అకౌంట్ లో ఈ - మెయిల్స్ తో నిండిపోయి ఉంటే , మీరు చేయవలసిందల్లా జీమెయిల్ ఓపెన్ చేయాలి. ఇక సెర్చ్ బార్ లో " is:read"అని కమాండ్ ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మీరు చదివిన అన్ని ఈ -  మెయిల్స్  లిస్టు కనిపిస్తుంది. ఇక ఇప్పుడు మీరు అన్ని మెయిల్స్  పైన ఉన్న " ఆల్ సెలెక్ట్ బాక్స్ " ఒకటి కనిపిస్తుంది. దీని పైన క్లిక్ చేయాలి. ఇలా చేసినప్పుడు కేవలం యాభై మెయిల్స్ మాత్రమే సెలక్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు అంత కంటే ఎక్కువ మెయిల్స్ ను డిలీట్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మీరు " Select All Conversation That Match This search " అనే  ఆప్షన్ పై  క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఇప్పుడు మీరు చదివిన అన్ని ఈ-మెయిల్స్ కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ లిస్టులో 1000 ఉన్న 10,000 ఉన్న 20,000 ఉన్నాసరే , అన్ని ఒకేసారి సెకండ్.. రెప్పపాటు కాలంలో డిలీట్ అవడం జరుగుతుంది. అయితే మీరు ఇలా బల్క్  మొత్తంలో డిలీట్ చేయాలనుకుంటే , మీకు ముఖ్యమైన ఈ మెయిల్ ను అన్ టిక్  చేసి డిలీట్ చేసుకోవడం మంచిది.



మరింత సమాచారం తెలుసుకోండి: