ఇండియా ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ నుండి ఇండియాలో ఎక్కువగా అమ్ముడవుతున్న పాపులర్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కార్ టాటా నెక్సాన్ ఈవి ను కంపెనీ త్వరలోనే అప్‌డేట్ చేయనుంది. ఇక తాజాగా ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబంధించి ఇటీవల ఢిల్లీ RTO పత్రం బయటకు రావడం జరిగింది. ఇక ఇందులో ఈ కారు గురించి కొత్త సమాచారం వెల్లడవ్వడం జరిగింది.ఇక ఈ పత్రం ప్రకారం, కంపెనీ తమ Nexon EV కార్ లో మరింత పవర్ ఫుల్ వేరియంట్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న Tata Nexon EV ఎక్కువగా 129 బిహెచ్‌పి శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, కొత్తగా రానున్న సూపర్ పవర్ వెర్షన్ దీని కంటే అదనంగా 7 బిహెచ్‌పిల శక్తిని ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం అందుతుంది.

ఇక ఒకవేళ ఇదే కనుక జరిగితే కొత్త అప్‌డేటెడ్ Tata Nexon EV పవర్ అవుట్‌పుట్ ఈ విభాగంలో అమ్ముడవుతున్న hyundai Kona ఎలక్ట్రిక్ కారు పవర్ అవుట్‌పుట్‌తో సమానంగా ఉండే అవకాశం ఉందట. అయితే, ఈ పవర్ అవుట్‌పుట్ అనేది పెరిగిన తర్వాత కూడా, Tata Nexon EV ఈ విభాగంలో దొరుకుతున్న మరొక ఎలక్ట్రిక్ కారు MG ZS EV కంటే కూడా 7 బిహెచ్‌పిలు తక్కువగా ఉంటుందట.కాగా, Nexon EV లో చేయబోతున్న ఈ పవర్ అప్‌గ్రేడ్, దాని రేంజ్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో ఎదురు చూడాలి. పవర్ పెరిగిన కారణంగా, దాని రేంజ్ కూడా అలాగే ఉంటుందా లేక తగ్గుతుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఒక్క మార్పు తప్ప కొత్త Tata Nexon EV లో వేరే ఏ ఇతర మార్పులు చేయబడవని స్పష్టంగా తెలుస్తోంది.ఇక ఈ కార్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర వచ్చేసి రూ. 13.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక అదే సమయంలో ఈ కార్ టాప్-మోడల్ వేరియంట్ ధర వచ్చేసి రూ. 16.40 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇక ఈ కార్ ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో కెల్లా చాలా చవకైనదిగా ఇంకా ఎక్కువ రేంజ్‌ను ఆఫర్ చేసే ఎలక్ట్రిక్ కార్లలో ఒక కార్ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: