
సాంసంగ్ గాలక్సీ M13 5G:
ప్రముఖ ఆన్లైన్ ఈ కామర్స్ దిగ్గజమైనా అమెజాన్లో ఈ ఫోన్ ధర రూ.13,999.. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64 GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది. 6.5 అంగుళాల HD ప్లస్ ఎల్సిడి డిస్ప్లే తో 90 Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. 5000 ఎం ఏ హెచ్ లిథియం అయాన్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత సాఫ్ట్వేర్ పై పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. 50 mp ప్రధాన కెమెరా..2MP మైక్రో కెమెరా తో పాటు 5MP ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంది.
ఒప్పో A74 5G:
దీని ధర రూ.14,990 ధరతో ప్రారంభం అవుతుంది . 6.5 అంగుళాల ఫుల్ హెచ్డి హైపర్ కలర్ స్క్రీన్ తోపాటు 90 Hz రీఫ్రెష్ రేటును కలిగి ఉంటుంది. 5000 ఎం ఏ హెచ్ బ్యాటరీ కలిగి ఉన్న ఈ స్మార్ట్ ఫోన్లో.. 48 mp ప్రధాన కెమెరా +2MP మ్యాక్రో +2MP డెప్త్ లెన్స్ , 8MP ఫ్రంట్ కెమెరా కూడా అమర్చబడి ఉంది. వీటితోపాటు మరెన్నో 5g స్మార్ట్ ఫోన్లు మీకు తక్కువ ధరకే లభిస్తూ ఉండడం గమనార్హం.