మొబైల్ మార్కెట్‌లో మధ్యతరగతి ప్రజలకు అతి దగ్గరగా ఉన్న కంపెనీ షియోమీ. ప్రస్తుతం స్మార్ట్ టీవీ మార్కెట్‌లో కూడా దూసుకుపోతోంది. అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ షియోమీ.. వినియోగ‌దారుల‌ను ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోన్ల‌ను విడుదల చేస్తుంటుంది. ఈ క్ర‌మంలోనే వివిధ సిరీస్​ల్లో కొత్త ఫోన్లను తీసుకు వచ్చింది. తాజాగా అదిరిపోయే ఫీచర్లతో మరో ఫోన్​ను తేనున్నది. ఎంఐ 10, ఎంఐ 10 ప్రోలను వీలైనంత త్వరగా మార్కెట్లోకి తీసుకురావాలని ఎంతగానో ప్ర‌య‌త్నిస్తుంది షియోమీ.

 

తాజాగా లీకైన పోస్టర్ ప్రకారం చూసినట్లయితే.. ఈ ఫోన్లను ఫిబ్రవరి 11వ తేదీన షియోమీ ప్రకటించే అవకాశం ఉంది. అయితే తాజాగా షియోమీ ఎంఐ 10 ప్రో ఎంఐయూఐ 11 అప్ డేట్ కోడ్ తో కనిపించింది. దీంతోపాటు ఈ ఫోన్ కు సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్ లో ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీనిని బ‌ట్టీ చూస్తే.. ఇందులో 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, వెనకవైపు నాలుగు కెమెరాలు  ఉండ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

 

అలాగే వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగా పిక్సెల్ కాగా, 16 మెగా పిక్సెల్, 12 మెగా పిక్సెల్, 5 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న మరో మూడు కెమెరాలు ఉండనున్నట్లు స‌మాచారం. మ‌రియు 6.4 అంగుళాల స్క్రీన్, బ్యాటరీ సామర్థ్యం 5250 ఎంఏహెచ్, క్వాల్ కాం తాజా ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 865ను ఇందులో అందించ‌నున్న‌ట్టు లీకైన స‌మాచారం ద్వారా తెలుస్తోంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: