ప్రపంచంలో  టెక్నాలజీ రోజురోజుకు చాలా వేగంగా పెరుగుతోంది. అరచేతిలోనే  అన్ని చూసుకునే టెక్నాలజీ కూడా వచ్చింది. రానున్న రోజుల్లో  ఇంకా ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి  ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టెక్నాలజీ పరంగా రోజురోజుకు అందనంత ఎత్తుకు ఎదుగుతున్న మానవాళికి.. ఈ సృష్టిలో ఇంకా అంతుచిక్కని రహస్య లెన్నో మన ముందున్నాయి. ఇప్పటికీ వారికి సమాధానం లేదు. ఇలాంటి రహస్యాలను చెందించేందుకు  ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణం ప్రారంభమైంది. దాదాపు ముప్పై సంవత్సరాలుగా దీని నిర్మాణానికి ప్రణాళికలు చేస్తున్నారు.

 దీని డిజైన్, అన్ని రకాల అనుమతులు దొరకడంతో జులై మొదటి వారంలో దీని పనులు మొదలయ్యాయి. ద స్క్వేర్ కిలోమీటర్ అబ్జర్వటరీ అని పేరు కూడా పెట్టారు. దీనిలో రెండు వందల అతి పెద్ద డిష్ రిసీవర్లు, కోటి 30 వేల చిన్న యాంటీనాలతో  నిర్మిస్తున్నారు. దీంతో ఇప్పుడున్న టెలిస్కోప్ బ్లాక్ కంటే   పది రెట్లు అధిక  సామర్థ్యంతో కాస్మోస్ ను  అధ్యయనం చేయడానికి వీలవుతుంది. ప్రపంచంలోనే అతి పెద్ద వ్యవస్థ కలిగిన ఈ టెలిస్కోప్ 70 మెగా హెడ్జుల రేడియో ఫ్రీక్వెన్సీ, 25 గీగా హెడ్జుల రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ను వినగలుగుతుంది. అలాగే దీన్ని రెండు ఖండాలలో నిర్మించడం విశేషం. ఎస్ కె ఏ మధ్య శ్రేణి గల వ్యవస్థను  దక్షిణాఫ్రికాలోని కరు ఎడారిలో 50 అడుగుల వ్యాసార్థం కలిగిన 197 డిష్ లతో, తక్కువ శ్రేణి ఫ్రీక్వెన్సీ వినగలిగే వ్యవస్థను 1,32,072 యాంటీనాలతో  పశ్చిమ ఆస్ట్రేలియాలో ఏర్పాటు చేయనున్నారు. ఈ టెలిస్కోప్ దాదాపు యాభై ఏళ్ళు పని  క్రియాశీలకంగా చేయగలదు. ఎస్ కే ఏ ఓ సైన్స్ వర్కింగ్ గ్రూప్ లో  40 దేశాలకు చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు ఉన్నారు.

 ఈ భారీ రేడియో టెలిస్కోప్ విజ్ఞాన సామర్థ్యాన్ని వెలుగులోకి తీసుకురావడానికి  ఈ శాస్త్రవేత్తలు అంతా కృషి చేస్తున్నారు. ఈ విశ్వంలో జీవం ఎలా పుట్టింది. గెలాక్సీ ఎలా ఏర్పడ్డాయి. ఇతర గ్రహాల లోగుట్టు ఏమిటి. అనే విషయాలపై క్షుణ్నంగా ఆద్యయనం చేసి విషయాలను బయట పెట్టనున్నారు. టెలిస్కోప్ ఏర్పాటుకు రెండు బిలియన్ డాలర్లు ఖర్చు వస్తుందని  ప్రస్తుతం వారు అంచనా వేశారు . 2029 సంవత్సరం నాటికి  దీని నిర్మాణ పనులు పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ 2024 నుంచి శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించాలన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: