ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో సెల్ఫోన్ అనేది ఎలా అయితే భాగం అయిపోయిందో ఇక సెల్ఫీ అనేది కూడా అలాగే మారిపోయింది అనే విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీ ప్రపంచంలోనే బ్రతికేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఒక చిన్న సెల్ఫితో అక్కడి ప్రదేశాలను మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియాలో బంధిస్తూ ఉండడం గమనార్హం. ఇలా నేటి రోజుల్లో సెల్ఫీ అనేది ప్రతి ఒక్కరూ లైఫ్ లో సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఈ సెల్ఫీ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే.


 ఎంతో అందంగా ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్న ఎంతో మంది ప్రమాదపు అంచున నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ ఉంటుంది. చివరికి ప్రమాదం జరిగి విగతజీవులుగా మారిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఇక అక్కడ పొంచి ఉంది అని  అధికారులు  బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ ఎవరు మాత్రం వినిపించుకోవడం లేదు. ఇటీవల స్నేహితులతో కలిసి సముద్రానికి వెళ్లిన సమయంలో ఆరుగురు మృత్యువాత పడిన ఘటన గురించి మరవకముందే.. ఇక ఇప్పుడు మరో యువకుడు ఇదే రీతిలో ప్రాణం పోగొట్టుకున్నాడు. జలపాతం పక్కన అందంగా ఫోటో దిగాలని భావించాడు యువకుడు.


 కానీ ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడి పోయి గల్లంతయ్యాడు. తమిళనాడులోని కొడైకెనాల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అజయ్ పాండ్యన్ అనే వ్యక్తి స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళతాడు. జలపాతం దగ్గర నిలబడి ఫోటో దిగాలని భావించాడు. అక్కడ నిలబడి ఫోటోలకు ఫోజు ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా అతని కాలు జారి ఇక జలపాతం లోకి దూసుకు వెళ్ళాడు. అయితే ఈ సంఘటన మొత్తం ఫోన్లో రికార్డయింది అనే చెప్పాలి. విషయం తెలుసుకున్న రెస్క్యూ సిబ్బంది సంఘటనా స్థలంలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ యువకుడి మృతదేహం మాత్రం లభించలేదు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: