టాలీవుడ్ లో అందరికీ నచ్చే అతి కొద్ది మంది హీరోలలో మంచు మనోజ్ ఒకరు. అందరితోనూ చాలా ఫ్రెండ్లీ గా ఉంటూ అందరివాడు అనిపించుకుంటూ ఉంటాడు. ఈయన సినిమాల్లో ఎంత ఎనర్జీటిక్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. అయితే ఆయన సినిమాల్లోనే కాక బయట కూడా అంతే ఎనర్జీటిక్ గా ఉంటాడు. .తన డిఫరెంట్ యాక్టింగ్ అండ్ బాడీ ల్యాంగ్వేజ్ తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఈ/టాలెంటెడ్ హీరో. 

ఒక్క సినిమాలతోనే కాకుండా తన వ్యక్తిత్వంతో కూడా అనేకమంది అభిమానులను మనోజ్ సంపాదించుకున్నాడు. అయితే ఆయన గత మూడేళ్లుగా సినిమాలకు దూరమైనా సంగతి తెలిసిందే.. కారణాలు ఏవైనప్పటికి ఆయన తాజాగా " అహం బ్రమ్హస్మి " అనే సినిమా తో మళ్ళీ తెరపై కనిపించబోతున్నాడు. మరి అభిమానులతో చాలా ఫ్రెండ్లీ గా ఉండే మంచు మనోజ్ ఇప్పుడు సడెన్ గా తన అభిమానులను కుటుంబ సభ్యులను మరియు తన స్నేహితులను అలర్ట్ చేస్తున్నాడు.

తన వాట్సాప్ హ్యాక్ అయ్యిందని ఎవరూ దానికి రెస్పాండ్ అవ్వొద్దని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే ఈ మధ్యనే వాట్సాప్ కు సంబంధించి ప్రైవసీ పాలసి విషయంలో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ సమయంలో ఇలాంటి ఘటన ఎదురవ్వడం మరింత షాక్ కు గురి చేస్తుంది. అయితే ఇంతకు ముందే చాలా మంది సెలెబ్రెటీల తాలూకా సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి మనోజ్ యొక్క వాట్సప్ ఎలా హ్యాక్ అయ్యింది అన్నదానిపై స్పష్టత రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: