ఇక కరోనా వైరస్ ఘోరంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.రోజు రోజుకి కేసులు చాలా ఎక్కువవుతున్నాయి. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారితో చాలా తీవ్రంగా సతమతమవుతుంది. అలాగే చాలా మరణాలు నమోదవుతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా వుండాలంటే శుభ్రంగా ఉండాలి.కాబట్టి శానిటైజర్ తప్పక వాడాల్సిన పనుంది. ఈ నేపథ్యంలో శానిటైజర్ వాడకం కూడా ఎంతగా పెరిగిందో అందరికి తెలిసిన సంగతే. కరోనా మహమ్మారి  సోకకుండా ఉండేందుకు శానిటైజర్ రాసుకోవడం తప్పనిసరి అని చెప్పాలి.అయితే శానిటైజర్ అది వాడటం ఎంత ఉపయోగకరమో.. సరిగ్గా వాడకపోతే అంతే ప్రమాదకరం కూడా. ఎందుకంటే.. శానిటైజర్‌కు మండే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ డ్రైవర్ వలన మళ్ళీ తెలిసి వచ్చింది.కాబట్టి.. ఈ డ్రైవర్ చేసిన తప్పును మీరు ఎప్పుడూ చేయకండి.


ఇక అగ్ర రాజ్యమైన అమెరికాలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ వ్యక్తి కారులో ప్రయాణిస్తూ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగాడు. ఆ సమయంలో స్మోక్ చేస్తున్నాడు. అలా సిగరెట్ తాగుతూ చేతికి సానిటైజర్ రాసుకున్నాడు. అంతే క్షణాల్లో అతడి చేతికి మంటలు అంటుకున్నాయి. ఆ వెంటనే కారులో కూడా మంటలు చెలరేగాయి. ఆ వ్యక్తి వెంటనే కారు నుంచి తప్పించుకొని కిందకి దూకేసాడు. దీంతో పెద్ద ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ, కారు మాత్రం పూర్తిగా కాలిపోయింది.

మోంట్‌గోమేరీ కౌంటీ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్‌ అధికార ప్రతినిధి పేటే పిరింగెర్ ఈ వీడియోను పోస్టు చేశారు. ‘‘డ్రైవర్ శానిటైజర్ వాడుతూ స్మోకింగ్ చేయడం వల్ల కారులో మంటలు ఏర్పడ్డాయి’’ అని తెలిపారు. కారులో ప్రయాణించేప్పుడు మీరెప్పుడూ ఇలా చేయొద్దని, శానిటైజర్-సిగరెట్ చాలా బ్యాడ్ కాంబో అని సూచించారు.ప్రస్తుతం ఈ వీడియో రెండ్రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది. మీరు చూసేయండి..



మరింత సమాచారం తెలుసుకోండి: