వాట్సాప్ ఈ రోజుల్లో ప్ర‌తీ ఒక్క‌రికీ ఎంత‌గానో ద‌గ్గ‌ర‌యిపోయిన‌ది. సామాన్య ప్ర‌జ‌లంద‌రూ ఈజీగా వాట్సాప్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఎంఎస్ చేసే ద‌గ్గ‌ర నుంచి ఫోటోలు, వీడియోలు, లొకేష‌న్‌లు ఇలా అన్నింటిని తెగ వాడుతున్నారు. అయితే అలాంటి వాట్సాప్ ఇప్పుడు ఆన్ లైన్ పేమెంట్ తీసుకొచ్చిన విష‌యం విధిత‌మే.

వాట్సాప్‌లో పేమెంట్ ఆప్ష‌న్ ఇటీవ‌ల కాలంలోనే అందుబాటులోకి వ‌చ్చిన‌ది. అయితే ఈ వాట్సాప్ ద్వారా ట్రాన్‌స‌క్ష‌న్  చేసుకునే క‌స్ట‌మ‌ర్ల‌ను పెంచుకునేందుకు వాట్సాప్ ఇప్పుడు అదిరిపోయే ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించిన‌ది. త‌మ సంస్థ‌పై న‌మ్మాకాన్ని పెంచేందుకు ఇప్పుడు క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ ను అందిస్తున్న‌ట్టు తెలిపింది. అందులో మ‌రొక విష‌యం కూడా వెల్ల‌డించిన‌ది.

ముఖ్యంగా కేవ‌లం ఒక్క‌రూపాయి పంపినా కూడా ఈ క్యాష్ బ్యాక్ ఆఫ‌ర్ అనేది వ‌ర్తిస్తున్న‌ద‌ని పేర్కొన్న‌ది వాట్సాప్‌. అయితే ఇందులో మాత్రం కొన్ని నిబంధ‌న‌లు కూడా  ఉన్నాయి.  వాట్సాప్ ద్వారా ఐదు ట్రాన్‌స‌క్ష‌న్ల వ‌ర‌కే ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంద‌ని.. ఆ త‌రువాత చెల్లించే వాటికి మాత్రం ఈ ఆఫ‌ర్ వ‌ర్తించ‌దు అని ఆ సంస్థ ప్ర‌తినిధులు వెల్ల‌డించారు. అయితే ఇక వాట్సాప్ ద్వారా వ‌చ్చిన ఈ క్యాష్ బ్యాక్ వెంట‌నే మ‌న అకౌంట్‌లో జ‌మ అవుతుంద‌ట‌. కానీ ఈ ఆఫ‌ర్ వ‌ర్తించాలంటే 6 ఆండ్రాయిడ్ బీటా యూజ‌ర్లు అయి ఉండాలి

అతి త్వ‌ర‌లోనే ఈ క్యాష్ తీసుకురానున్నట్టు వాట్సాప్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది. ఈ ఆఫ‌ర్ ను చూస్తున్న‌ట్ట‌యితే గ‌తంలో గూగుల్ పే, ఫోన్ పే, గుర్తుకు వ‌స్తున్నాయ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు. ఫోన్ పే, గూగుల్‌, పే టీమ్ వంటి యాప్స్ ప్రారంభంలో ఎన్నో ఆఫ‌ర్ల‌ను తీసుకొచ్చి ఆక‌ట్టుకున్నాయి. అయితే ఈ ఆఫ‌ర్లు కొద్ది రోజుల వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసారు. ఆ త‌రువాత ఇప్పుడు ఫోన్ పే అయితే మ‌రీ ఛార్జీల‌ను కూడా వ‌సూలు చేయ‌డం మొద‌లు పెట్టింది. ఇదే బాట‌లో త్వ‌ర‌లో మిగ‌తావి అన్ని యాప్‌లు చేస్తాయ‌ని స‌మాచారం. ఇప్పుడు వాట్సాప్ ఈ ఆఫ‌ర్ పెట్టి  క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ర్షించుకున్న త‌రువాత తిరిగి మ‌ర‌ల అదే చేస్తుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: