హైదరాబద్ సిటీ కల్చర్ పెరిగింది.. దానితో పాటుగా హత్యలు, మహిళలపై అత్యాచారాలు కూడా పెరిగాయి. అనడంలో ఎటువంటి సందేహం లేదు. తగ్గని హత్యలు, ఊపందుకున్న వ్యభిచారం జోరందుకున్నాయి. ఈ సందర్బంగా రోజుకో వ్యభిచారం గుట్టు రట్టు అవుతుంది.స్పా, సెలూన్ ముసుగులో అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్న ఫ్లాట్‌పై జూబ్లిహిల్స్ పోలీసులు గత రాత్రి రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నిర్వాహకులు, ఆరుగురు విటులను అరెస్ట్ చేసి పలువురు యువతులకు విముక్తి కల్పించారు...
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న సెక్స్‌రాకెట్‌ను పోలీసులు చేధించారు. అశోక్‌నగర్‌లోని ఓ స్పా సెంటర్లో కొనసాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని సోమవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్పా సెంటర్ యజమానితో పాటు విటుడు, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు.
షాపింగ్ మాల్లో హెవెన్స్ థాయ్ మసాజ్ పేరుతో ఓ స్పా సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆ సెంటర్‌కు రాత్రివేళ యువకులు అధికంగా వచ్చి ఎక్కువ సమయం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఓ వ్యక్తిని విటుడి రూపంలో అక్కడికి పంపించారు. ఆ వ్యక్తి స్పా సెంటర్ యజమానికి సంప్రదించి అమ్మాయి కావాలని కోరగా అతడు డబ్బులు తీసుకుని గదిలోకి పంపించాడు.
రూమ్‌లోకి వెళ్లిన తర్వాత నకిలీ కస్టమర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు స్పా సెంటర్‌పై రైడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడితో పాటు ఓ విటులు, ఇద్దరు సెక్స్‌వర్కర్లను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో చాలాకాలం నుంచి వ్యభిచార దందా నడుస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అలా లే దందాను చేస్తున్నారని అంటున్నారు..మరి సిటీలో ఇంకా ఎన్నో ఉన్నాయి..అంటూ పోలీసులు విచారణ చేపట్టారు..ఈ స్పాలు నిర్వహించేది బడానాయకులే అని వెల్లడైంది . పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి...