వర్షాకాలం వచ్చిందంటే చాలు  వాన జల్లుల్లో తడవటం సహజమే. ఇలా తడిసిన ప్రతిసారీ ఆ ప్రభావం జుట్టు మీద ఖచ్చితంగా పడుతుంది.జుట్టు తడిచిందని కొంతమంది ఆడవాళ్లు తలస్నానం చేయకుండా ఊరికే టవల్ తో తుడుచుకుంటారు. కానీ అలా చేయడం వల్ల  పట్టుకుచ్చులాంటి జుట్టు కళతప్పి వెలవెలబోతుంది. నూనె పెట్టిన జుట్టు అయితే తడిచి చమురు వాసన వస్తుంది. అందుకే వానాకాలంలో ఆడవాళ్లు  కురుల సంరక్షణ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

 

 

జుట్టుకు ప్రధాన శత్రువు  చుండ్రు. వానలో తడిస్తే చుండ్రు మరింతగా విజృంభిస్తుంది. అందుకే వానలో తడిసినప్పుడు పెరుగు లేదా రి ఫైయిన్డ్ ఆయిల్ తో మాడు, జుట్టుకు మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి.తడిచిన జుట్టును రోజంతా అలాగే వదిలేస్తే దుర్వాసన రావటంతో బాటు జుట్టు చిట్లటం, రాలటం జరుగుతుంది. అందుకే వానలో తడిసినప్ప్పుడు తడిజుట్టును దువ్వకుండా ముందుగా మెత్తని, పొడి తువ్వాలుతో తల తుడుచుకొని ఆ తర్వాతే దువ్వుకోవాలి. తువ్వాలుతో తల తుడుచుకుంటే అది.. మర్దనగా పనిచేస్తుంది.తర్వాత తల స్నానం చేయాలి. తల స్నానాం చేయడం కుదరకపోతే జుట్టును బాగా ఆరనివ్వాలి. 

 

 

 

తలస్నానానికి ముందు ఆముదం వంటి చిక్కని నూనె రాయకూడదు. బాదాం, కొబ్బరినూనె వంటి పలుచని నూనెలు కొద్దిగా వేడిచేసి తలకుపట్టించి మర్దన చేసి దువ్వెనతో తల దువ్వుకోవాలి. దీనివల్ల మాడుకు రక్తప్రసరణ పెరిగి కేశ మూలాలు బలపడతాయి.చుండ్రు బాధితులు తలస్నానం తర్వాత మంచి కండిషనర్  వాడాలి.బయటకువెళ్ళేవారు వానలో తల తడవకుండా గొడుగు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో వారానికి 2 సార్లు కొబ్బరి నూనెలో కరివేపాకు వేయించి ఆ గోరువెచ్చని నూనెను జుట్టుకు పట్టించి హెర్బల్ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా,నల్లగా మారుతుంది.కాలుష్యం వల్ల జుట్టు పొడిబారి, రాలుతుంటే వారానికి కనీసం రెండు సార్లు హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: