ఇక పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలన్నీ కూడా మంచి ఆఫర్లతో కొత్త కొత్త వాహనాలు విడుదల చేస్తుంటే, అమెరికన్ కార్ తయారీ సంస్థ 'జీప్' మాత్రం తన 'కంపాస్'  ధరలను భారీగా పెంచింది.జీప్ కంపాస్ ధరలు ఇప్పుడు ఒక్కసారిగా రూ. 90,000 పెరిగాయి. ధరల పెరుగుదల తరువాత బేస్ స్పోర్ట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 19.29 లక్షలకు చేరింది. అదే సమయంలో టాప్-ఎండ్ వేరియంట్ అయిన ట్రైల్‌హాక్‌ ధర రూ. 32.22 లక్షలకు చేరింది.ఏఏపీ కంపాస్ 2022 ఏప్రిల్ లో కూడా ఒకసారి ధరలను పెంచింది. ధరలు పెరుగుదల ఇప్పటికి వరుసగా మూడవసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ధరల పెరుగుదల వల్ల ఈ సంవత్సరం ఏకంగా మూడు రెట్లు పెరిగింది. కావున జీప్ కంపాస్ ధరలు మునుపటికంటే కూడా రూ. 1.50 లక్షలు ఎక్కువ. ఇది కొనుగోలుదారులపైన భారీ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంటుంది.జీప్ కంపెనీ తన కంపాస్ SUV ని 2017 లో ఫ్లాగ్‌షిప్ SUV గా విడుదల చేసింది. కాగా క్రమంగా కంపెనీ ఇందులో అప్డేటెడ్ వెర్షన్స్ విడుదల చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే గత నెలలో కంపాస్ యానివర్స్‌రే ఎడిషన్ విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 24.44 లక్షలు (ఎక్స్-షోరూమ్).జీప్ కంపాస్ SUV  రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కాగా, మరొకటి 2.0 లీటర్ బిఎస్6 డీజిల్ ఇంజన్. ఇంజన్ 7 స్పీడ్ DCT గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అందువల్ల మంచి పనితీరుని అందిస్తుంది.


ఇక 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఇది గరిష్టంగా 170 బిహెచ్‌పి పవర్ ఇంకా 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ అలాగే 7-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది.జీప్ కంపాస్ సరికొత్త డిజైన్ కలిగి ఉంటుంది. అందువల్ల హెడ్‌లైట్, ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్, హానీ కూంబ్ ఇన్సర్ట్‌లతో అప్‌డేట్ చేయబడిన 7-స్లేట్ గ్రిల్, న్యూ ఫ్రంట్ బంపర్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఇంకా కొత్త ఫాగ్ లైట్ హౌసింగ్ ఉన్నాయి. ఈ కారు  సైడ్ ప్రొఫైల్ కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది.ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో కొత్త డాష్‌బోర్డ్ ఉంది, 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త ఎసి వెంట్స్ ఇంకా హెచ్‌విఎసి కంట్రోల్స్ ఉన్నాయి. ఇందులో కంపెనీ  యుకనెక్ట్ 5 టెక్నాలజీ ఇవ్వబడింది. అంతే కాకుండా.. అమెజాన్ అలెక్సా సపోర్ట్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ అలాగే ఓవర్ ఎయిర్ అప్‌డేట్ ఈ కారులో అందించబడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: