ఆటో మొబైల్ కంపెనీలు ఎప్పుడూ ఏదోక కొత్త మోడల్ కార్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొన్ని కార్లు ఏడాది మొదట్లోనే భారీ సేల్స్ ను అందుకున్నాయి.. కరోనా భయంతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కంటే ప్రజలు పర్సనల్ మొబిలిటీకే ప్రాధాన్యం ఇవ్వడంతో కొన్ని నెలలుగా కార్ల కొనుగోలుకు డిమాండ్ పెరుగుతున్నది. జనవరితోపాటు ఫిబ్రవరిలోనూ కార్ల విక్రయాల్లో గ్రోత్ కొనసాగుతూ వచ్చింది. భారతదేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి విక్రయాల్లో 8.3 శాతం గ్రోత్ నమోదైంది. గత ఫిబ్రవరిలో 1,44,761 యూనిట్లు అమ్ముడు పోగా, గతేడాది 1,33,702 కార్లు మాత్రమే సెల్ అయ్యాయి.


గత ఏడాది ఫిబ్రవరి సేల్స్ తో పోలిస్తే ఈ ఏడాది మొదట్లోనే సేల్స్ భారీగా పెరగడం విశేషం అని చెప్పాలి.విటారా బ్రెజా, ఎస్‌-క్రాస్‌, ఎర్టిగా, ఎక్స్ఎల్‌-6 తరహా ఎస్‌యూవీ కార్ల సేల్స్‌లో 18.9 శాతం వ్రుద్ధి నమోదైంది. గతేడాదిలో 22,604 కార్లు అమ్ముడైతే, ఈ ఏడాది 26,884 మంది ఈ కార్లను కొనుగోలు చేశారు. అయితే, ఎంట్రీ లెవెల్ ఆల్టో 800, ఫ్లాగ్ షిప్ సెడాన్ కార్ల  తక్కువ సేల్స్ ను నమోదు చేయలేదని స్పష్ట మవుతుంది.హ్యుండాయ్ మోటార్స్ గతనెలలో గణనీయ పురోగతిని నమోదు చేసింది. 2020 ఫిబ్రవరితో పోలిస్తే 29 శాతం వ్రుద్ధిని నమోదు చేసుకున్నది. గతేడాది 40,010 కార్లు అమ్ముడు పోగా, ఈ ఏడాది 51,600 మంది కొత్త కార్లు కొనుగోలు చేశారు. వీటిలో క్రెటా, వెన్యూ, ఐ 20, నియోస్ కార్లు భారీ సేల్స్ ను అందుకున్నాయి.


టయోటా అనూహ్య రీతిలో 36 శాతం గ్రోత్ సాధించింది. 2020 ఫిబ్రవరిలో 10,352 మంది కొత్తగా టయోటా కార్లు కొనుగోలు చేస్తే, ఈ ఏడాది 14,075 యూనిట్లు అమ్ముడయ్యాయి. జనవరిలో టయోటా లాంచ్ చేసిన ఫార్చూనర్ లెజెండర్‌, ఫార్చూనర్ ఫేస్ లిఫ్ట్‌తోపాటు ఇన్నోవా క్రిస్టా ఫేస్‌లిప్ట్ మోడల్ కార్లు భారీ అమ్ముడయ్యాయి అని కంపెనీ సేల్స్ లో పేర్కొన్నారు.టాటా మోటార్స్ తొమ్మిదేండ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డులు క్రియేట్ చేసింది. 119 శాతం కార్ల విక్రయాలు జరిగాయి. మరో సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా కార్ల సేల్స్‌లో 3.3 శాతం ప్రగతి రికార్డయింది. ఇలా కార్లు అన్నీ కూడా కరోనా సమయంలో మంచి టాక్ ను అందుకోవడం తో గ్రేట్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: