ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ఏ రకంగా చుట్టుముట్టిందో అందరికీ తెలిసిందే.  కరోనాకి మందు రాలేదు.. మన జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష అంటున్నారు. అందుకోసం మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ ఉండాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇక ఇలాంటి సమయంలో వేడుకలకు దూరంగా ఉండాలని అధికార యంత్రాంగమంతా చెబుతోంది.  చాలా మంచి, చెడు ఏదో ఒక వేడుకలకు హాజరైన వారికి కరోనా సోకుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన పోలీస్ శాఖలోని కొందరు వ్యక్తులు నిబంధనలను అతిక్రమిస్తున్నారు.


ఇలాంటి వారి కారణంగా మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోంది. మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్టలో పోలీస్ కానిస్టేబుళ్లు జన్మదినోత్సవ సంబురాల్లో పాల్గొన్న వ్యక్తుల్లో ఇద్దరికి కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో బాధ్యులపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ కొరడా ఝులిపించారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్‌కు సీపీ షో కాజ్ నోటీస్ జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: