ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి ఇటీవ‌ల పండండి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆమె కుమార్తెకు నామ‌క‌ర‌ణం చేశారు. ఈ పేరు ఇప్పుడు సోష‌ల్ మీడియా అంతటా వైర‌ల్‌గా మారింది. ఈ కార్య‌క్ర‌మానికి మ‌రో డిప్యూటీ సీఎం ధ‌ర్మాన కృష్ణ‌దాస్‌తో పాటు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఆయ‌న భార్య విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు పార్టీ నేత‌లు హాజ‌ర‌య్యారు.

శ్రీవాణి కుమార్తెకు యశ్విత శ్రీజగతి అని నామకరణం చేశారు. ఈ పేరుతో జ‌గ‌న్ ఫ్యామిలీ అంతా క‌లిసొచ్చేలా అక్ష‌రాలు ఉన్నాయి. వై అనే అక్షరం కలిసి వచ్చేలా యశస్వి.. ఎస్ అనే అక్షరం వచ్చేలా శ్రీజగతి అని ఆ చిన్నారికి పేరు పెట్టారు. ఇక జ‌గ‌న్‌తో పాటు ఆయ‌న భార్య భార‌తి పేర్లు క‌లిసి వ‌చ్చేలా శ్రీజ‌గ‌తి అని పెట్టారు. ఈ పేరు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌గా.. .వైఎస్సార్ అభిమానులు దీనిని షేర్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: