కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ‘ఆపరేషన్‌ చక్ర’ను వేగవంతం చేసింది. ఆర్థిక నేరాలకు పాల్పడిన సైబర్‌ నేరగాళ్ల ఇళ్లు, కార్యాలయాల్లో మరోసారి దాడులు జరిపింది. మంగళవారం దేశవ్యాప్తంగా 105 చోట్ల  దాడులు జరిపింది. 300 మంది సైబర్ అనుమానితులపై సీబీఐ దృష్టి సారించింది. నిన్న మొదలుపెట్టిన ఈ ఆపరేషన్‌లో 87 ప్రాంతాల్లో సీబీఐ నేతృత్వంలో దాడులు జరిగాయి. 18 ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల పోలీసులు సోదాలు చేపట్టారు.

ఇంటర్‌పోల్‌, ఎఫ్‌బీఐ, రాయల్‌ కెనడియన్‌ మౌంటెయిన్‌, ఆస్ట్రేలియన్‌ ఫెడరల్‌ పోలీసులు ఇచ్చిన  సమాచారం ప్రకారం సీబీఐ ఈ దాడులు చేపట్టింది. అమెరికాలోని అమాయక పౌరులే లక్ష్యంగా పుణె., అహ్మదాబాద్‌లో నిర్వహిస్తోన్న రెండు కాల్‌ సెంటర్లపై సీబీఐ దాడి చేసింది. అండమాన్‌ నికోబార్‌లో నాలుగు చోట్ల దిల్లీలో ఐదు చోట్ల, చండీగఢ్‌లో మూడు చోట్ల, పంజాబ్‌, కర్ణాటక, అస్సాంలో రెండు చోట్ల ఈ సోదాలు జరిగినట్టు సీబీఐ తెలిపింది. రాజస్థాన్‌లో జరిపిన దాడుల్లో కోటిన్నర నగదు, కిలోన్నర బంగారాన్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: