ఇవాళ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ  ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనీ లాండరింగ్‌ కేసులో హాజరు కావాలని రోహిత్ రెడ్డి కి గతంలో ఈడీ నోటీసులు పంపింది. ఇవాళ ఉదయం 10:30 గంటలకు ఈడీ విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడి అధికారులు పేర్కొన్నారు. అయితే.. దీనిపై ఇప్పటికే స్పందించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి న్యాయవాదితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

విచారణకు వచ్చేటప్పుడు.. 2015 సంవత్సరం నుంచి ఆస్తుల, కంపెనీ వివరాలు కుటుంబ సభ్యుల బ్యాంక్ అకౌంట్స్ డాక్యుమెంట్లు  తీసుకురావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు హాజరుకానున్న నేపథ్యంలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అందుకే మోడీ సర్కారు పైలెట్ రోహిత్ రెడ్డి టార్గెట్‌ చేసినట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: