సాధార‌ణంగా ప్ర‌తి ఒక్క‌రూ తాము అందంగా, ప్ర‌కాశవంతంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు. అందుకు ఎన్నో ప్ర‌యోగాలు, ప్ర‌య‌త్నాలు చేస్తుతంటారు. ముఖ్యంగా వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి స్కిన్ కంప్లెక్షన్ పెంచుకోవడానికి చూస్తుంటారు. అయితే ఒక్కోసారి ఏదైనా అర్జెంట్ ఫంక్ష‌న్స్‌కు గాని లేదా పార్టీస్ వెళ్లాల్సి వ‌స్తుంది. దుర‌దృష్టం ఏంటంటే.. అప్పుడు మ‌న ముఖం దారుణంగా ఉంటుది. అలాంటి స‌మ‌యంలో ఇన్స్టెంట్ స్కిన్ వైటనింగ్, ఇన్స్టెంట్ స్కిన్ గ్లోయింగ్ కొన్ని టిప్స్ ఫాలో అయితే అంద‌రిలోనూ మీరే ప్ర‌త్యేకంగా క‌నిపించ‌వ‌చ్చు.

 

అందులో ముందుగా పాల‌ లో వైటనర్ లక్షణాలు పుష్క‌లంగా లభిస్తాయి. అలాగే, మాయిశ్చరైజింగ్ సామర్థ్యం కూడా ఎక్కువే. అందువ‌ల్ల పాల‌లో నిమ్మ‌కాయ పిండి దాన్ని ఫేస్‌కు అప్లే చేసుకోవాలి. ఒక పావుగంట ఆర‌నిచ్చి ఫేస్ క్లీన్ చేసుకుంటే స్కిన్ వైట్‌గా క‌నిపించ‌డ‌మే కాకుండా గ్లోయింగ్‌గా కూడా క‌నిపిస్తుంది. అలాగే బియ్యం పిండి, తేనె మిక్స్ చేసుకుని ముఖానికి ప‌ట్టాంచాలి. స్కిన్ స్ట్రెచ్ గా అనిపిస్తుంటే, వాటర్ చిలకరించి, మర్ధన చేస్తూ ముఖాన్ని నీటితో శుభ్రంగా కడిగేయాలి.

 

ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. అదేవిధంగా, అలోవెర జెల్‌ను, కీరదోసకాయ జ్యూస్ రెండూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నిఫేస్‌కు అప్లై చేయాలి. ప్యాక్‌ వేసుకున్న పావుగంట తర్వాత, స్కిన్‌ స్ట్రెచ్‌ అవ్వడం స్టాట్ అవుతుంది. అప్పుడు నీటితో ముఖం క్లీన్‌‌ చేసుకోవాలి. ఇలా వ‌ల్ల ఇన్స్టెంట్ వైటనింగ్ పొందొచ్చు. మ‌రియు ఒక టీస్పూన్ పెరుగుకు ఒక టీస్పూన్ తేనె మిక్స్ చేసి ఫేస్‌కు అప్లై చేయాలి. ఆరిన త‌ర్వాత ముఖం క్లీన్ చేసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: