ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా వైరస్ బీభ‌త్సం సృష్టిస్తోంది. రోజూ వంద‌లు. వేల సంఖ్య‌లో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను హ‌రిస్తోంది. తాజాగా.. ఈ వైర‌స్ బారినప‌డి పంజాబ్‌లో అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్(ఏసీపీ)ను కూడా మృతి చెందారు. పంజాబ్‌లోని లూథియానా అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కోహ్లీ ఎస్పీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అక్కడి జిల్లా ప్రజా సంబంధాల కార్యాలయం(డీపీఆర్‌వో) వెల్లడించింది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్ అమ‌లులో పోలీసులు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ రాత్రింబవళ్లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో దేశం మొత్తం వారి సేవ‌ల‌కు సెల్యూట్  చేస్తోంది. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు పోలీసుల సేవ‌ల‌ను కొనియాడుతున్నారు.

 

అయితే.. ఇక్క‌డ మ‌రొక బాధ‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. అనేక మంది పోలీస్ సిబ్బంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో పోలీస్ అధికారి మృతి చెంద‌డంతో క‌ల‌క‌లం రేగుతోంది. పోలీస్ వ‌ర్గాలు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. ఇక‌ ఇటీవ‌ల మ‌హారాష్ట్రలో కూడా పోలీస్ సిబ్బంది క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డ్డారు. వారంద‌రినీ వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతున్నారు. క‌రోనా వైర‌స్‌పై పోరులో ఇప్ప‌టిర‌వ‌కు వైద్యుల త‌ర్వాత ఎక్కువ‌గా పోలీసులే ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: