క‌రోనా వైర‌స్‌..చైనాలోని వుహాన్ న‌గ‌రం కేంద్రంగా పుట్టిన విష‌యం తెలిసిందే. చూస్తూ ఉండ‌గానే.. ప్ర‌పంచాన్ని చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ వైర‌స్‌పై అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇన్నిరోజులూ ఈ వైర‌స్ భూమిపై, బ‌ట్ట‌ల‌పై త‌దిత‌ర వ‌స్తువుల‌పై మాత్ర‌మే ఉంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అది మ‌న‌శ‌రీరంలోకి ముక్కు, మూతి, క‌ళ్ల ద్వారా ప్ర‌వేశిస్తుంద‌ని వైద్య‌నిపుణులు చెబుతూ వ‌చ్చారు. అయితే.. ఈ వైర‌స్‌కు స‌బంధించి నిత్యం ఏదో భ‌యంక‌రమైన‌ విష‌యం వెలుగులోకి వ‌స్తూనే ఉంది. తాజాగా.. వుహాన్‌లో మ‌రో సంచ‌ల‌న నిజం బ‌య‌ట‌ప‌డింది. చైనాలో కొవిడ్‌-19 పేషెంట్ల‌కు చికిత్స అందించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం కేవ‌లం ప‌దిరోజుల్లోనే ఆస్ప‌త్రిని నిర్మించి, ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన విష‌యం తెలిసిందే.

 

ఇప్పుడు చైనా ప్ర‌భుత్వం ఇదే ఆస్ప‌త్రి కేంద్రంగా మ‌రో సంచ‌ల‌న నిజాన్ని వెల్ల‌డించింది. ఏమిటా నిజ‌మంటే..  చైనా శాస్త్ర‌వేత్త‌లు  కొవిడ్‌-19 ఆస్ప‌త్రి ఉన్న ప్రాంతంలో గాలిలో కూడా వైర‌స్ ఉంటుందా..? అని ప‌రిశోధ‌న‌లు చేశారు. కొవిడ్ ఆస్ప‌త్రిలో గాలిలో కూడా క‌రోనా వైర‌స్ క‌ణాలు ఉన్నట్లు వారి ప‌రిశోధ‌న‌లో తేలింది. అంటే గాలిలో కూడా క‌రోనా వైర‌స్ జీవించ‌మేకాదు వ్యాపిస్తుందని కూడా తేలింద‌న్న‌మాట‌. దీంతో షాకైన శాస్త్ర‌వేత్త‌లు ఈ అంశంపై మ‌రిన్ని పరిశోధ‌న‌లు చేస్తున్నారు. దీనిపై ముందుముందు ఎలాంటి నిజం వినాల్సి వ‌స్తుందో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: