సామాన్య జ‌నంతోపాటు కొవిడ్ వారియ‌ర్స్‌, భార‌త త్రివిద ద‌ళాల‌కు చెందిన ఉద్యోగులు కూడా క‌రోనా వైర‌స్‌బారిన ప‌డుతున్నారు. తాజాగా.. బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా మరో 11 మందికి క‌రోనా వైర‌స్‌ వైరస్‌ సోకింది. అయితే మరో 13 జవాన్లు వైరస్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన వారిలో 10 మంది త్రిపురకు చెందిన వారు కాగా, ముగ్గురు ఢిల్లీకి చెందిన వారు ఉన్నారు.

 

అదేవిధంగా సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌లో ముగ్గురికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో సీఆర్‌పీఎఫ్‌లో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 254కు చేరింది. మరోవైపు ఐటీబీపీలోనూ 158 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో అందరూ ఢిల్లీకి చెందినవారే. ఈ ప‌రిణామాల‌తో ఆయా వ‌ర్గాల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఊహ‌కంద‌ని విధంగా వ్యాప్తి చెందుతున్న వైర‌స్‌తో ఆయా వ‌ర్గాల కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: