కరోనా కట్టడి విషయంలో ముందు నుంచి కూడా ఈశాన్య రాష్ట్రాలు సమర్ధవంతంగా పని చేస్తున్న సంగతి తెలిసిందే. దేశం మొత్తం కరోనా కేసులు తీవ్రంగా ఉన్నా ఈశాన్య రాష్ట్రాల్లో వందల్లో మాత్రమే కేసులు ఉన్నాయి. అసలు కొన్ని రాష్ట్రాల్లో అయితే మరణాలు కూడా లేవు. తాజాగా దీనిపై కేంద్ర సర్కార్ ఒక ప్రకటన చేసింది. 

 

ఈశాన్య రాష్ట్రాలలో తక్కువ సంఖ్య ఉందని ప్రభుత్వం పేర్కొంది. దేశంతో పోలిస్తే కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పింది. 5715 మందికి ఆ రాష్ట్రాల్లో కరోనా సోకింది. 3731 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మరణాల రేటు తక్కువగా ఉందని వెల్లడించింది. మణిపూర్, మిజోరాం, నాగాలాండ్ మరియు సిక్కింలలో మరణాలు లేవని భారత ప్రభుత్వం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: