ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలందరికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే కరోనా నిర్దారణ పరీక్షలను నోటి, ముక్కు ద్వారా స్వాబ్‌ను సేకరించి పరీక్షలు చేస్తారు. దీనివల్ల డబ్బుతో పాటు సమయం కూడా వృథా అవుతోంది. పైగా పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడమూ కష్టంతో కూడుకున్న వ్యవహారం.

ఈ క్లిష్ట సమయంలో చిన్నపాటి బ్రీత్‌ టెస్ట్‌ ద్వారా కరోనా నిర్ధారించగలిగితే ఎలా ఉంటుంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. అమెరికా ఫ్లోరిడాలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మియామీ పరిశోధకులు అలాంటి ఓ కొత్త టెస్టును అభివృద్ధి చేశారు. అర్ధరాత్రివేళ మందుబాబులు వాహనాలు నడపకుండా గుర్తించేందుకు పోలీసులు ఉపయోగించే బ్రీత్‌ అనలైజర్‌ లాంటిదే ఈ టెస్ట్‌. చిన్నపాటి ట్యూబ్‌లోకి ఊదడం ద్వారా వచ్చే గాలి తుంపర్లను భద్రపరిచి స్కానర్‌ ద్వారా పరిశీలించి ఆ మనిషికి కొవిడ్‌ ఉందో లేదో నిర్ధారించడం ఈ టెస్ట్‌ ఉద్దేశం. అతి తక్కువ సమయంలో కొవిడ్‌ను నిర్ధారించడమే లక్ష్యంగా దీన్ని చేపట్టినట్లు పరిశోధకులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: