దేశంలో క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,10,147 పరీక్షలు నిర్వహించగా.. 21,954 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 72 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌ మొత్తం పాజిటివ్‌ కేసులు 12,28,186కి పెరిగాయి. ప్రస్తుతం 1.82 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు మొత్తం 8,446 మంది మరణించారు. 24 గంటల్లో 1.10 లక్షల శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 13,353 మంది ప్రస్తుతం కొవిడ్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నట్లు ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. సెకండ్‌ వేవ్‌ మొదలైన తర్వాత వరుసగా నాలుగో రోజు 20వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: