ప్రపంచదేశాలు కరోనాతో పోరాటం చేస్తున్న ఈ సమయంలో అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ శుభవార్త అందించింది. కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించడంలో ఒక కొత్త టీకా సమర్థంగా పనిచేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లో తొలిసారి వెలుగు చూసిన కరోనా వైరస్‌ రకాలు, గబ్బిలాలకు సంబంధించిన కరోనా వైరస్‌లపైనా ఇది పనిచేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు కోతులు, ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో వెల్లడైనట్లు వివరించారు. కాగా..మానవుల్లోనూ ఇదే ఫలితం రావొచ్చని పేర్కొన్నారు. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన బార్టన్‌ ఎఫ్‌ హేన్స్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ టీకాను అభివృద్ధి చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: