ఆఫ్ఘనిస్తాన్ లో ప్రముఖ కమెడియన్ దారుణ హత్యకు గురైన సంఘటన సంచలనంగా మారింది. తాలిబన్ లు ఆ దేశంలో పని చేస్తున్న ప్రముఖ కమెడియన్ ని అత్యంత దారుణం గా, కిరాతకం గా హత్య చేశారు, ఆఫ్ఘనిస్తాన్ లో కాందహార్ ప్రావిన్స్ లో ప్రముఖ కమెడియన్ అయినటువంటి మహమ్మద్ నాజర్ ని కొంత మంది దుండగులు తుపాకీ చూపించి బెదిరించి మరి, ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లారు ఆ తర్వాత హత్య చేశారు. దీనికి గల కారణం నాజర్ నటుడి గా మారక ముందే పోలీసు విభాగంలో పని చేసినట్లుగా తెలుస్తోంది. అందువల్ల జరిగి ఉండవచ్చని అంత భావిస్తున్నారు. ఇక దాదాపుగా 70 శాతం ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ లు ఇప్పటికే ఆక్రమించగా తమ దాడిని తీవ్రతరం చేస్తూ అనేక కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారు దుండగులు.


మరింత సమాచారం తెలుసుకోండి: