బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్‌కు నేషనల్ యాంటీ టుబాకో ఆర్గనైజేషన్ రాసిన లేఖ సంచలనంగా మారింది. పాన్ మసాలాను ప్రచారం చేసే ప్రకటన ప్రచారం నుంచి వైదొలగాలని సంస్థ కోరింది. పొగాకు, పాన్ మసాలా వ్యసనం వ‌ల్ల పౌరుల ఆరోగ్యాన్ని క్షీణిస్తుందని వైద్య పరిశోధనల్లో తేలింది. దీనివ‌ల్ల పాన్ మసాలాలను ప్రోత్సహించే ప్రకటనల ప్రచారం నుంచి వైదొలగాలని కోరుతూ అధ్యక్షుడు శేఖర్ సల్కర్ అమితాబ్ కు లేఖ రాశారు. ‘‘అమితాబ్ హై ప్రొఫైల్ పల్స్ పోలియో ప్రచారానికి ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నార‌ని, అతను వీలైనంత త్వరగా పాన్ మసాలా ప్రకటనల నుంచి తప్పుకోవాల‌ని, పొగాకు వ్యసనం నుంచి యువత దూరంగా ఉండటానికి ఈ చర్య దోహ‌దం చేస్తుంద‌న్నారు. ‘‘పాన్ కేన్సర్ కారకంగా పనిచేస్తోందని ఇటీవలి పరిశోధనలో తేల‌డంతోపాటు తమలపాకులోని పదార్థాలు శరీరంలో కేన్సర్ కారకాలుగా మారి నోటి కేన్సర్‌కు దారితీస్తాయని రుజువైంద‌ని శేఖ‌ర్ పేర్కొన్నారు. పాన్ మానవులకు కేన్సర్ కారకం అనే శాస్త్రీయ ఆధారాలను ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ కేన్సర్, ప్రపంచ ఆరోగ్య సంస్థలు నిర్థారించిన విష‌యం తెలుసుకోవాలంటూ శేఖ‌ర్ బిగ్‌బీకి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: