బావ క‌ళ్ల‌ల్లో ఆనందం చూడ‌టం కోసం అనే డైలాగ్ ఉమ్మ‌డి రాష్ట్రంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బాగా పాపుల‌ర్ అయింది. బావ క‌ళ్లల్లో ఆనందం చూడ‌టం కోసం అత‌నికి బ‌ద్ధ శ‌త్రువైన ఒక వ్య‌క్తిని ఒక కిరాయిరౌడీ చంపాడు. అత‌న్ని కొంత‌మంది పావుగా ఉప‌యోగించుకున్నారు. దీనికి చంపిన వ్య‌క్తి స‌మాధానం ఏమిటంటే.. బావ క‌ళ్ల‌ల్లో ఆనందం చూడ‌టం కోస‌మే ఆ ప‌ని చేశాన‌ని చెప్పాడు. అంత‌వ‌ర‌కు జ‌రిగింది బాగానే ఉందికానీ.. ఇప్పుడు బావ‌, బావ‌మ‌రిది అవుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌, మా అధ్య‌క్షుడు మంచు విష్ణు మ‌ధ్య కూడా ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ఈ డైలాగ్‌ను వ‌ర్తింప చేస్తున్నాయి. ఎవ‌రి అవ‌స‌రాలు వారికి ఉన్న‌ప్ప‌టికీ ఒక‌రి గెలుపు కోసం మరొక‌రు బాగా క‌ష్ట‌ప‌డ్డారు అని వ్యాఖ్యానిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్ తాజాగా విడుద‌ల చేసిన వీడియో ఫుటేజ్‌ను బ‌ట్టి మొన్న‌టివ‌ర‌కు ఏపీలో అధికారంలో ఉన్న వైకాపా మూవీ ఆర్టిస్ట్ అసోసియేస‌న్ ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకుంద‌ని స్ప‌ష్టమ‌వుతోంది. ఒక వైకాపా వ్య‌క్తి ఎన్నిక‌ల హాల్‌లో స‌భ్యుల‌ను బెదిరించాడు అనేది ప్ర‌కాష్ రాజ్ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. దీనికి సంబంధించి మోహ‌న్ బాబుకానీ, విష్ణు కానీ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa