బురుండి దేశంలో లోని ఒక జైలులో జరిగిన అగ్నిప్రమాదంలో కనీసం 38 మంది మరణించారు. మరో 69 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
బురుండీ తూర్పు ఆప్రికా దేశాలలో ఒకటి. దీని రాజధాని గితెగా. ఈ నగరంలో రద్దీగా ఉండే జైలు సముదాయంలో మంటలు చెలరేగాయని, కనీసం 69 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ ఉపాధ్యక్షుడు ప్రాస్పర్ బజోంబాంజా విలేకరులతో అన్నారు. ఆదేశ ప్రసార మాధ్యమాలలో ప్రసారం అవుతున్న చిత్రాలు జైలులో ఖైదీలు మాంసపు ముద్దలుగాను, మృతదేహాల కుప్పలతో నిండిన భవనాన్ని చూపుతున్నాయి. "ఇది నిజంగా విపత్తు," అని ఘటనా స్థలం నుంచి బతికి బైటపడిన ఒక ఒక ఖైదీ ఫోన్‌లో తనకు పరిచయం ఉన్న మీడియా వ్యక్తులకు చెప్పారు. ఖైదీలు నిద్రపోయే గదులన్నీ దాదాపు తొంభై శాతం కాలిపోయాయని అతను చెప్పారు. నేను ఎలా బైట పడగలిగానో నాకు తెలియదు అని అతను మీడియాకు ఫోన్ లో వివరించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చినట్లు కూడా అతను తెలిపారు
క్రిస్టియన్ అసోసియేషన్ అగైనెస్ట్ టార్చర్ బురుండి పేర్కోన్న వివరాల  ప్రకారం, 400 మంది ఖైదీల సామర్థ్యం ఉన్న జైలు అది. ఇందులో   నెల క్రితమే 1,539 మంది ఖైదీలను అందులో ఉంచారు. బురుండి అంతర్గత  వ్యవహారాల మంత్రిత్వ శాఖ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని పేర్కొంది. అదే జైలులో గత ఆగస్టులో ఓ అగ్ని ప్రమాదం సంభవించింది, దీనికి కూడా విద్యుత్ సమస్యలే కారణమని అధికారులు  పేర్కోన్నారు.  అయితే  నాడు చెలరేగిన మంటల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: