చైనా కంపెనీ ప్రతినిధులపై ఈడీ అధికారులు భౌతిక దాడి చేశారా.. అవునంటోంది షావోమీ కంపెనీ. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్  అధికారులపై... చైనా మొబైల్ తయారీ కంపెనీ షావోమీ ఈ సంచలన ఆరోపణలు చేసింది. విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం ఫెమాను ఉల్లంఘించారన్న ఆరోపణలపై దర్యాప్తు సమయంలో షావోమీ ప్రతినిధులపై ఈడీ అధికారులు భౌతికదాడికి దిగారట.

విచారణ సమయంలో ఈడీ చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వకపోతే తీవ్రపరిణామాలు ఉంటాయని షావోమీ ప్రతినిధులను హెచ్చరించారట. అందుకే ఈ ఒత్తిడికి తలొగ్గి తమ ప్రతినిధులు కొన్ని విషయాల్లో ఈడీ చెప్పినట్టు వాంగ్మూలం ఇచ్చారట. ఈ షావోమీ 2014 నుంచి భారత్ లో కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే.. 2015 నుంచే అక్రమంగా నిధులను ఇతర దేశాలకు తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. మరి ఈ ఆరోపణపై ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

MI