గ్రంధాలయాలు విజ్ఞాన భాండాగారాలు.. కానీ వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాయి ప్రభుత్వాలు..  పూర్వవైభవానికి గ్రంధాలయాల ఛైర్మన్లు పూర్తి అంకిత భావంతో పనిచేస్తామంటున్నారు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. గ్రంధలయాలను అభివృద్ధి చేయడంతోపాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు.  ఈ దిశగానే పనిచేయాల్సిందిగా గ్రంథాలయాల చైర్మన్ లకు మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.


విద్యార్ధులకు అందుబాటులో ఉండేలా లైబ్రరీల రూపురేఖలు మార్చాలని మంత్రి బొత్స సత్యనారాయణ  అన్నారు. త్వరలో దాదాపు 4 వేల డిజిటల్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రతి గ్రామవార్డు సచివాలయానికి అనుసంధానంగా ఒక గ్రంధాలయం ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ  స్పష్టం చేశారు.  గ్రంధాలయాల ఛైర్మన్ పోస్టును రాజకీయ పునరావాసంగా కాకుండా, ఒక మంచి అవకాశంగా మలచుకుని పనిచేస్తే ఛైర్మన్లకు మంచి పేరు వస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: