చైనా ఆగడాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుండటం చూస్తూనే ఉన్నాం. ఆ దేశం సరిహద్దులలో ఉన్న ప్రతి దేశంపై అధిపత్యానికి ప్రయత్నిస్తూ అందరితో ఏదో ఒక గొడవకు దిగుతూనే ఉంది. ఎన్ని సార్లు చెప్పినా ఇదే చేస్తూ ఉండటం ఆయా దేశాలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చైనా వాణిజ్య పరంగా తనతో పోటీ వస్తున్నవారిపై ప్రతీకార చర్యలకు పూనుకుంటు తన ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంది. అయితే భారత్ లాంటి దేశాలు దాని ఆగడాలకు తగిన బుద్ది ఎప్పటికప్పుడు చెపుతూనే ఉన్నాయి. ఇటీవలే లడక్ లో చైనా చేసిన రచ్చతో విసిగిపోయిన భారత్ ఆ దేశం యాప్ లను ఎన్నింటినో వాడరాదని దేశీయులకు చెప్పి, వాటిని నిషేదించింది. అలాగే ఆదేశం తో వాణిజ్య ఒప్పందాలను కూడా రద్దుచేసుకుంది.

దీనితో చైనా తెరవెనుక నిచ్చవ్యూహాలు పన్నుతూ దేశంలో లోన్ యాప్ లతో ప్రజల వద్ద నుండి నగదు దోచుకుంటూ, ఆర్థిక నేరాలకు పాల్పడుతుంది. దీనిని గమనించిన భారత అధికారులు విచారించగా దీనికి కారణం కూడా చైనా అనే విషయాన్ని స్పష్టం చేశారు. ఈ విధంగా చైనా తన కు పోటీ అని తెలిసిన దేశాలపై ఉచ్ఛనీచాలు మరిచి ఇష్టానికి ఏదో ఒక దారిలో ఇబ్బంది పెడుతూనే ఉంది. తాజా ఆఫ్ఘన్ ఆక్రమణ కూడా భారత్ ను దెబ్బతీయడానికే అనేది ప్రపంచానికి తెలిసిన నిజమే. దానికోసం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిందో తెలియదు కానీ దానిని ఆ దేశ ప్రజల కోసం ఖర్చు చేసి ఉంటె కనీసం కొందరైనా పేదరికం నుండి బయట పడేవారు.

చైనా కు ప్రపంచ ఆధిపత్యం లాంటి ఆలోచనలు ఉన్నాయనే విషయం కనిపెట్టలేని దేశాలు ఆ దేశాన్ని తమ ఉత్పత్తి రాజధానిగా చేసుకున్నాయి. దీని వలన ఆయా చైనా ఉత్పత్తులు ప్రపంచం నలుమూలల వ్యాపించాయి. దీనితో చైనా ఆయా వస్తువులలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా దేశాల రహస్య సమాచారం దోచుకుంటుంది. ఇప్పుడు ఇది ప్రపంచంలో పెద్ద సమస్యగా పరిణమించింది.  తాజాగా లిధుయోనియా దేశం లో కూడా చైనా మొబైల్స్ లో చిప్స్ ఉన్నట్టు కనిపెట్టడంతో ఆదేశ రక్షణ శాఖ తక్షణమే చైనా మొబైల్స్ ను విసిరి పడేయాలని తమ పౌరులకు ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: