కావాల్సిన ప‌దార్థాలు:
వంకాయలు- పావుకిలో
ఆవపిండి - 150 గ్రా
మెంతిపిండి- ఒక టీ స్పూను
పసుపు- అరటీ స్పూను


ఇంగువ - చిటికెడు
చింతపండు - 50గ్రా
కారం-150 గ్రా 
ఉప్పు- 150గ్రా


తయారీ విధానం: ముందుగా వంకాయల్ని మనకు కావాల్సిన సైజులో ముక్కలు క‌ట్ చేసుకోవాలి. స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నూనెపోసి కాగాక ఈ ముక్కల్ని వేసి కొద్దిగా మగ్గనిచ్చి దించుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో రెండు టేబుల్‌ స్పూన్ల నూనె వేసి కాగాక ఇంగువ వేసి దింపేయాలి. చింతపండుని ఉడికించి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి.


ఒక  గిన్నెలో ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి బాగా కలుపుకొని చింతపండు గుజ్జు, వంకాయ ముక్కలు, కాచిన నూనె వేసి కలుపుకోవాలి. దీన్ని గాజుసీసాలో పెట్టిన తర్వాత కొంచెం నూనెని పచ్చడిపై పోసుకోవాలి. అంతే వంకాయ ఆవకాయ తయారయినట్టే. రైస్‌తో వంకాయ ఆవ‌కాయ‌ కాంబినేష‌న్ చాలా బాగుంటుంది. వంకాయ కూర‌ల‌ను ఇష్ట‌ప‌డ‌ని వారు ఇలా చేసుకుంటే స‌రిపోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: