డబ్బు ప్రాణాలు పోస్తుంది, అవసరం అయితే ప్రాణాలు తీస్తుందని తెలిసిన విషయమే కానీ మరీ అయిదు రూపాయలు ప్రాణాం తీస్తుందని ఎవరైనా ఊహిస్తారా.. అసలే ఊహించరు.. కానీ కేవలం అయిదు రూపాయలు మనిషిలోని విచక్షణను కోల్పోయేలా చేసి ఇద్దరి ప్రాణాలను ప్రమాదంలో పడవేసిన ఘటన హర్యాణాలోని ఓ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. ఆ వివరాలు చూస్తే..

 

 

బల్లాబార్గ్ ప్రాంతానికి చెందిన జిత్తు, నిఖిల్, ఫరిదాబాద్ ప్రాంతానికి  చెందిన మోహిత్, దీపక్ స్నేహితులు కాగా ఈ నలుగురు కలిసి కారులో వెళుతున్న క్రమంలో, హర్యాణ రాష్ట్రంలోని కేర్కిదేలా టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. అక్కడ వీరు టోల్ ఫీజు చెల్లించే క్రమంలో రూ. 100 తీసిచ్చారు.. కాగా రూ. 65 టోల్ ఫీజు తీసుకున్న అక్కడి సిబ్బంది మిగతా రూ. 35 ను కారులో ఉన్న వారికి అందచేసే సమయంలో వీరి చేతిలో నుండి రూ. 5 కాయిన్ కిందపడిపోయింది.. కాగా టోల్ సిబ్బంది కారును పక్కకు తీసి.. కిందపడిపోయిన రూ. 5 కాయిన్ ను తీసుకోవాలని సూచించారు.

 

 

దీంతో ఆ కారులో ఉన్న వారు టోల్ ప్లాజా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. విచక్షణ కోల్పోయిన ఆ నలుగురు వెంటనే కారులో ఉన్న కత్తిని తీసుకుని అక్కడున్న సిబ్బందిపై దాడి చేశారు. టోల్ ప్లాజా మేనేజర్ తో పాటు మరో ఉద్యోగిపై కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడుతుండగా, దీనిని అడ్డుకొనేందుకు ప్రయత్నించిన మరో ఉద్యోగిని కూడా గాయపరచాలని వారు చూసారు..

 

 

వీళ్ళ బారినుండి తప్పించుకున్న సదరు ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. రక్తపు మడుగులో ఉన్న మేనేజర్, సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే ఆ దుండగులు కారులో పరార్ అయ్యారు. కానీ వారిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. ఇకపోతే టోల్ ప్లాజా మేనేజర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు...  
 

మరింత సమాచారం తెలుసుకోండి: