రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో ఓ బాలుడు కిడ్నాప్ గుర‌వ్వ‌డం క‌ల‌క‌లాన్ని సృష్టిస్తోంది. ఉన్న‌ట్టుండి ఆడుకుంటున్న బాలుడు ఒక్క‌సారిగా అదృశ్యం అయ్యేస‌రికే కుటుంబ‌స‌భ్యులు రోదిస్తున్నాడు. అస‌లు ఏమ‌య్యాడు. ఎవ‌రు తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారు. బాలుడిని తీసుకెళ్లాల్సిన అవ‌స‌రం ఏమి వ‌చ్చింద‌ని ఆలోచన‌లో ప‌డ్డారు కుటుంబ‌స‌భ్య‌లు.  

వివ‌రాల్లోకి వెళ్లితే.. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ హైద‌ద్‌గూడలోని న్యూఫ్రెండ్స్‌కాల‌నీలో ఉన్న‌టువంటి కొండ‌ల్‌రెడ్డి అపార్టుమెంట్ స‌మీపంలో అనీష్ అనే బాలుడు ఆడుకుంటున్నాడు. ఉన్న‌ట్టుండి గురువారం మ‌ధ్యాహ్నం నుంచి అదృశ్య‌మ‌య్యాడు. దీంతో బాలుడు క‌నిపించ‌క‌పోవ‌డంతో కుటుంబ‌స‌భ్యులు వెత‌క‌డం మొద‌లుపెట్టారు. మ‌ధ్యాహ్నం అదృశ్య‌మైన బాలుడు ఎక్క‌డికి వెళ్తాడు సాయంత్రం వ‌ర‌కు వ‌స్తాడు లే అనుకున్నారు కుటుంబ స‌భ్య‌లు. కానీ సాయంత్రం వ‌ర‌కు రాక‌పోవ‌డంతో అప్ప‌టిక‌ప్పుడు రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 10 బృందాలుగా బాలుడి కోసం గాలింపులు మొద‌లుపెట్టాయి.

 బాలుడిని కిడ్నాప్ చేశారా లేదా అనే అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు కుటుంబ స‌భ్యులు. కొండ‌ల్‌రెడ్డి అపార్టుమెంట్ లో ఉన్న‌టువంటి సీసీ కెమెరా గ‌త ప‌ది రోజుల నుంచి ప‌ని చేయ‌డం లేదని పేర్కొంటున్నారు. ఆ అపార్ట్‌మెంట్ కు స‌మీపంలో ఉన్న‌టువంటి ఓ సీసీ కెమెరాను ప‌రిశీలించ‌గా అందులో ఒక మ‌హిళ బాలుడిని తీసుకెళ్తున్న‌ట్టు వెల్ల‌డైంది. ఆ మ‌హిళ ఎవ‌రు అనేది తేలాల్సి ఉంది. పోలీసులు ప‌లు బృందాలుగా వెత‌క‌డం మొద‌లు పెట్టారు. ఈ విష‌యం చూసి బాలుని కుటుంబ స‌భ్యులు, ఆ అపార్టుమెంట్ వాసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బాలుడి కిడ్నాపున‌కు సంబంధించిన సీసీ పుటేజీలో ఉన్న చిత్రాల‌ను చూసి  కుటుంబ‌స‌భ్యులు కంట‌త‌డి పెట్టారు.  మ‌రోవైపు రాజేంద్ర‌న‌గ‌ర్‌లో  త‌రుచూ ఏదో ఒక సంఘ‌ట చోటు చేసుకుంటూనే ఉంటుంది. కిడ్నాప్‌లు ఇక్క‌డ ఎక్కువ‌గా జ‌రుగుతుంటాయని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గానే తాజాగా  రాజేంద్ర‌న‌గ‌ర్ స‌బ్‌రిజిస్ట్రార్ కార్యాల‌యంపై ఏసీబీ అధికారులు దాడులు చేప‌ట్టారు. దీంతో అంద‌రూ రాజేంద్ర‌గ‌న‌ర్ గురించి చ‌ర్చించుకుంటున్నారు.మరింత సమాచారం తెలుసుకోండి: