
మరికొన్ని ఉగ్రవాద సంస్థలు యువతకు తీవ్రవాదం వైపు చూపుతూ వారిని ఆకర్షణ చేసుకుంటూ హిందువులే లక్ష్యంగా దాడులు చేయాలని లేదా వేరే మతాలని లేకుండా చేయాలి వారికి శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి దేశంలో ఎలాంటి మత ఘర్షణలకు తావు లేకుండా సరైన చర్యలు తీసుకోవాలని డీజీపీలకు సూచించారు. ముఖ్యంగా ముస్లిం యువత తీవ్రవాదం వైపు అడుగులు వేయకుండా చర్యలు తీసుకునేందుకు ఆ మత పెద్దలతో మాట్లాడి వారిలో తీవ్రవాదం వైపు వెళ్లే భావజాలాన్ని తొలగించేలా సక్రమ మార్గంలో నడిచేలా చూడాలని చెప్పారు.
సరిహద్దుల్లో భారత సైన్యం సన్నద్ధతపై కూడా చర్చించారు. చైనా, భారత్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై చర్చించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. అంతర్గతంగా దేశంలో ఉన్నటువంటి యువత తీవ్రవాదం వైపు వెళ్లకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో డీజీపీలకు సూచించారు. పిఎఫ్ఐ అనేది ప్రమాదకరమైన సంస్థ అని దానిలో చేరుతున్నటువంటి వారిపై దృష్టి పెట్టాలని, అది ముఖ్యంగా ముస్లిం యువతకు ప్రమాదకరంగా పరిణమిస్తుందని అన్నారు. ఇలాంటి సంస్థలో దేశంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరారు. అంతర్గతంగా తీవ్రవాద భావజాలం పెరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.