ప్రభాస్ అనుష్కలు ప్రేమించు కున్నారో? లేదో? వారికే తెలియాలి లేకపోతె ఆ భగవంతునికి తెలియాలి. కానీ పలుమార్లు ‘మామధ్య ప్రేమ గీమా లేదని’ ఇద్దరు మొత్తుకున్నా, మొత్తుకుంటున్నా వాళ్ళ అభిమానులు పెళ్లి చేసేస్తున్నారు. ప్రసార మాధ్యమాలు బాజాభజంత్రీలు మోగిస్తూనే ఉన్నాయి.

మొత్తం మీద చెప్పొచ్చేదేమంటే వాళ్లలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకునే వరకు ఈ పుకారు షికారు చేస్తూనే ఉంటుంది. అభిమానం అలాంటిది. వాళ్లిద్దరూ బావుంటారు ‘ఒకరి అభిమానులు మరొకరికీ కూడా అభిమానులు’ కావటం ఇక్కడ పెళ్లి విషయం మీద, వారిపై వత్తిడికి కారణం.

అయితే పవన్ - కాపు రాజకీయం కూడా అలాంటిదే. ప్రభాస్ - అనుష్క పెళ్లి విషయానికీ, పవన్ - కాపు రాజకీయానికి పోలిక ఏమిటి? అంటే "పిచ్చోళ్ల పిచ్చి అభిమానం" అని చెప్పే ఉద్దేశమే. మెగా కుటుంబానికి ఒకరు కాదన్నా, మరొకరు వద్దన్నా, కాపులే పెద్ద అండ. మెగా కుటుంబం నుండి తామరతంపరగా హీరోలు పుట్టుకొస్తున్నా అందరికి మద్దతు దొరికేది తొలుత కాపుల్నుంచే.


వైసిపి వైఎస్ జగన్మోహన రెడ్డికి క్రిస్టియన్ కమ్యూనిటీ మద్దతు లాంటిదే ఇది. నారా చంద్రబాబు నాయుడికి అంటుకున్న 'పచ్చ మీడియా గజ్జి' వదులు కోవాలంటే వదులు తుందా? ఇది అలాంటి గజ్జె.

కాపుల్ని కులం అనకుండా "జాతి" అని చాల విశాలమైన పదం వాడతారు. ముద్రగడ. “మా జాతి” గా అభివర్ణించిన కాపుల గజ్జి ని కొంచెమైనా అంటించుకొని కూడా పవన్ కళ్యాణ్ రాజకీయం చేసి ఇతరులతో స్నేహం నెరపవచ్చు. విజయాల్ని కూడా సాధించవచ్చు.


"నన్నంటుకోకు నా మాల కాకి - అంటే కాకి వదుల్తుందా!" కాపులు పవన్ ను వదలరు. ఇది జనం కుల గజ్జితో పొర్లే కాలం. పవన్ వద్దన్నా అధికారం తెచ్చే సమీకరణం అతన్ని వదలిపోదు.

ఇప్పటి వరకు, త‌న‌ను కులాల‌ గాటన కట్టవద్దని -  అంట‌గ‌ట్ట‌ వ‌ద్ద‌ని, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పలు సమావేశాల్లో ఆవేశంతో ఊగి పోయేవారు. తను ఒక నూతన, నవశకం రాజకీయవేత్తనని ఆయన అంటుంటారు త‌న‌కు ఏ కుల‌మూ, మ‌త‌మూ లేద‌ని కూడా పాపం! ఆయ‌న వెల్ల‌డించారు.

త‌న‌ను కులం పేరుతొ సంకుచితంగా చూస్తారా? అంటూ, ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకు పడుతుంటారు పవన్ కళ్యాణ్.

ఇప్పుడు ఆయ‌న ఏ కులం త‌న‌కు వద్దంటున్నారో? ఏ కులం రంగైతే పూయవద్దని అంటున్నారో ఆ కులమే ఆయనను పొదివిలో పెట్టు కొంటుంది. చీ! పో! అన్నా - మరీ మరీ దగ్గరయ్యే గజ్జినే కులగజ్జి అంటారు.  అదే పవన్ ను పీడిస్తుంది. ఏ రంగు పూయ‌ వ‌ద్దన్నారో, అదే ‘కుల సామాజిక వ‌ర్గం’ నెత్తిన పెట్టుకుంది. ఆయన్ని, ఆయ‌న పార్టీ పల్లకిని, ఆ కులం భుజాల‌ పైకి ఎక్కించు కుంది.


పంచాయతీ ఎన్నికల్లో ఇప్పుడు కాపు సామాజిక వ‌ర్గం - జ‌న‌సేన ప‌రువు నిలిపింది. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన నిలిచి, ప‌రువు నిల‌బెట్టు కుందంటే, కేవ‌లం కాపు సామాజిక వ‌ర్గం అండ‌ తోనే! ఇది చర్చకు వివాదానికి తగని అందని విషయం. నో లాజిక్! నో సైన్స్! నో నీడ్ ఆఫ్ సెన్స్ ఆల్సో ! జస్ట్ వ్యాపిస్తున్న కులపిచ్చి. విశాలతను వదిలేసి కాపులు సంకుచితాన్ని కౌగలించు కుంటున్నారు.


దీనికి రుజువుగా కనిపించే నిలువెత్తు సాక్ష్యం! నాదెండ్ల మ‌నోహ‌ర్‌ - జ‌న‌సేన నాయ‌కుడు - కాపులు ఎక్కువ‌గా ఉన్న తూర్పు గోదావ‌రి జిల్లాలో త‌న పార్టీ మ‌ద్ద‌తు దారులుగా గెలిచిన వారికి స‌న్మానాలు చేయ‌డ‌మే! అంటే, దీనిని బ‌ట్టి, ప‌వ‌న్ కళ్యాణ్ ఎంత కాద‌నుకున్నా, కాపులే ఇప్పుడు ఆయనకు జ‌న‌సేనకు అండగా నిలిచార‌ని ప‌రోక్షంగా అంగీక‌రించ‌డ‌మే!

ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌లోని కాపు సామాజిక వ‌ర్గం రెండో మాట లేకుండా జ‌న‌సేన వైపు నిల‌బ‌డింది. నిజానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో జన‌సేన పెద్ద‌గా ఆశ‌లు పెట్టుకోలేదు. అయిన‌ప్ప‌టికీ, నెల్లూరు, ఉభ‌య గోదావ‌రి, కృష్ణా జిల్లాల చాలా పంచాయ‌తీల్లో జ‌న‌సేన మ‌ద్ద‌తు దారులు విజ‌యం సాధించారు. కాదు కాపులు ఏకమై గెలిపించారు.

నాలుగు ద‌శ‌ల పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత ఫ‌లితాల‌ను విశ్లేషిస్తే, జ‌న‌సేన అభ్య‌ర్థులను గెలిపించింది కేవ‌లం కాపు సామాజిక వ‌ర్గమే కావ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలో కాపుల‌ను ఇప్ప‌టికైనా సంపూర్ణంగా స్వంతం చేసుకోవాల్సిన అవ‌స‌రం ప‌వ‌న్‌ కు ఏర్ప‌డింది. అంతేకాదు, ప‌వ‌న్ ఇప్పుడు జనసేన రాజకీయాన్నిసరైన మలుపు తిప్పాల్సిన అవసరముంది. ఈ వత్తిడితో సరైన ట‌ర్న్ తీసుకోవలసిన అగత్యం, అవ‌స‌రం ఏర్ప‌డింది ప‌వ‌న్‌ కు.

గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు ప‌రిస్థితి ఎలా ఉన్నా, ఇప్పుడు కాపులు పవన్ కు స్పష్టత ఇచ్చారు. ఒక రకంగా దిశానిర్దేశం చేసారు.

టీడీపీని ఒక‌ప్పుడు విశ్వ‌సించి పట్టంగ‌ట్టిన కాపులు, తూర్పులో ఇప్పుడు జ‌న‌సేన‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అదేవిధంగా, గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించిన కాపులు ఇప్పుడు స్థానికంలోవ‌చ్చిన ఫ‌లితాన్ని బ‌ట్టి, ఆపార్టీని కూడా దూరం పెట్టార‌ని స్ప‌ష్ట‌ మ‌వుతోంది.

కాపులు జ‌న‌సేన వైపు నిల‌బ‌డ్డారు. మ‌రి ప‌వ‌న్ వారి వైపు నిల‌బ‌డ‌తారా! లేదా! ఏం జ‌రుగుతుందో! చూడాలి. నిరీక్షిద్దాం.

అనేక మంది నాయకులు కులాల మాటున పార్టీలను నిర్మించుకుంటారు. కానీ ఇప్పుడు కాపులు మాత్రం  “కుల రాజకీయ పార్టీకి నాయకుణ్ణి నిర్మించుకునే పని” లో పవన్ వెంట పడుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: