నిజం అండి బాబు... బంగారం ధరలు మళ్లీ తగ్గాయి.. నిన్న మొన్నటి వరుకు తారాస్థాయిలో ఉన్న బంగారం ధరలు ఇప్పుడు తగ్గుతన్నాయ్. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు కుప్పకూలిపోయాయి.. దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు.. దీంతో బంగారం ధరలు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి.. 

 

ఇంకా ఇప్పుడు మాత్రం బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయ్.. వరుసగా ఐదొవ రోజు ఈ బంగారం ధరలు తగ్గాయి.. అయితే కేవలం ఈ ఐదు రోజుల్లోనే దాదాపు 2 వేల వరకు బంగారం ధరలు తగ్గాయి.. మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.. ఇంకా తగ్గుదలతో నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. 

 

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 30 రూపాయిల తగ్గుదలతో 44,400 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 20 రూపాయిల తగ్గుదలతో 44,100 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 1,050 రూపాయిల తగ్గుదలతో 41,650 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ, ఆర్ధిక రాజధాని ముంబైలోను బంగారం ధరలు ఇలానే భారీగా తగ్గాయి. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలకు భారీగా డిమాండ్ తగ్గటమే కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.. ఏది ఏమినప్పటికీ.. బంగారం, వెండి ప్రస్తుతం ఎవరు కొనలేరు.                                                

మరింత సమాచారం తెలుసుకోండి: