షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ మొక్కను ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. రోజూ ఉదయానే ఆ మొక్క ఆకులను రెండు నమిలితే చాలు.ఈ మొక్కను కాస్టస్ ఇజెనస్ అంటారు. వాడుక భాషలో ఇన్సులిన్ మొక్క అంటారు. కొంతమంది షుగర్ మొక్క అని కూడా అంటారు. అంటే అర్థం ఆ మొక్కలో షుగర్ ఉంటుందని కాదు, అలాగే ఇన్సులిన్ కూడా ఉండదు. కాకపోతే ఈ ఆకులను తింటే ఆహారంలోని చక్కెరను గ్లైకోజన్ గా మారుస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.ఈ ఆకులు కాస్త పుల్లని రుచిని కలిగి ఉంటాయి. వీటిని నమలడం అంత రుచిగా అనిపించకపోవచ్చు. కానీ నమలాలి. అదే ఆరోగ్యానికి చాలా మంచిది. దీర్ఘకాలిక మధుమేహాన్ని అడ్డుకోవడం ఇది ముందుంటుంది. ఈ మొక్కలోని సహజ రసాయనం రక్తంలో చక్కెరను గ్లైకోజెన్‌గా మారుస్తుంది, ఇది చక్కెరను నియంత్రించడంలో, సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.మధుమేహంతో బాధపడేవారు తక్కువ రోగనిరోధక శక్తిని కలిగి ఉంటారు. వాతావరణం మారిందంటే చాలు వారు అనారోగ్యం బారిన పడతారు.


ఇన్సులిన్ ఆకులు దగ్గు, జలుబు, ఇతర ఇన్ఫెక్షన్లు, ఊపిరితిత్తుల సమస్యలు, ఉబ్బసం, అతిసారం, మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఇన్సులిన్ మొక్కల ఆకుల్లో కార్బోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. పాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ స్రావాన్ని చాలా ఎక్కువ ఉత్పత్తి అయ్యేలా పెంచుతుంది.ఇక ఈ ఆకులను రెండు విధాలుగా తినవచ్చు. ఒకటి ఆకులను కడిగి నమిలేయడం, రెండోది ఆకులను మెత్తగా రుబ్బి ఒక టీస్పూను రుబ్బును గ్లాసు నీటిలో కలుపుకుని తాగడం. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలా మంచిది. చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.షుగర్ తో బాధపడేవారు ఖచ్చితంగా తీపి పదార్థాలు, తెల్లన్నం తినకూడదు. వారు ఆకుకూరలు, కూరగాయలు వంటకాలను అధికంగా తీసుకోవాలి.భయంకరమైన ఈ డయాబెటిస్ ని అస్సలు తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు.కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: