మన శరీర భాగాల్లో కిడ్నీలు కూడా చాలా విలువైనవి. మూత్రం రూపంలో శరీరంలో ఉండే చెడు పదార్థాలు, రసాయనాలను తొలగించడం కిడ్నీల ముఖ్యమైన పని. కానీ, మూత్రపిండంలో కనుక ఏదైనా తేడాగా కనిపిస్తే..కిడ్నీ వ్యాధి భారిన పడే అవకాశం ఉంది.మూత్రపిండాల్లో చిన్న తిత్తులు ఏర్పడటం ప్రారంభిస్తాయి. దీన్నే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. సకాలంలో చికిత్స చేయకపోతే, పరిస్థితి తీవ్రంగా మారడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమస్యను సకాలంలో గుర్తించడం వల్లనే నియంత్రించే అవకాశం ఉంది.గత కొన్నేళ్లుగా పాలీసిస్టిక్ కిడ్నీ వ్యాధి కేసులు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇది ఏ వయసులోనైనా జరగవచ్చు. ఈ వ్యాధిలో మూత్రపిండంలో తిత్తులు ఏర్పడటం ప్రారంభిస్తాయి. దీనిలో ద్రవం కూడా నిండి ఉంటుంది. కొన్నిసార్లు పొక్కులు కూడా రావచ్చు. ఇలా జరిగితే కిడ్నీ పని చేసే సామర్థ్యం దెబ్బతింటుంది. ఈ వ్యాధిని సకాలంలో నియంత్రించకపోతే కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీస్తుంది. ఈ పరిస్థితిలో డయాలసిస్ లేదా మూత్రపిండ మార్పిడికి కూడా అవకాశం ఏర్పడుతుంది.ఇది జన్యుపరమైన వ్యాధి, ఇది ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది.


PKD సోకిన వ్యక్తులు కూడా కాలేయం, ప్యాంక్రియాస్‌తో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. రక్తపోటు ఉన్నవారికి పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆలస్యంగా గుర్తిస్తుంటారు.ఒక వ్యక్తి కుటుంబంలో PKDతో బాధపడుతున్నట్లయితే, ఈ వ్యాధి ఒక తరం నుంచి మరొక తరానికి వ్యాపిస్తుంది. అటువంటి పరిస్థితిలో, కిడ్నీలో తిత్తులు ఏర్పడటంలో ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సకాలంలో చికిత్స చేస్తే, ఈ వ్యాధిని సులభంగా నియంత్రించవచ్చు. సరైన సమయంలో చికిత్స పొందడం ద్వారా తిత్తుల సమస్య నయమవుతుంది. కానీ, రోగి దాని గురించి అజాగ్రత్తగా ఉంటే, రాబోయే కొన్నేళ్లలో కిడ్నీ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో సమస్యలు పెరుగుతాయి. ఆ సమయంలో పీకేడీ లక్షణాలు కనిపిస్తాయి.పొత్తికడుపు పెరగడం, మూత్రంలో రక్తం, నిరంతర వెన్నునొప్పి ఇంకా అలాగే తరచుగా మూత్ర విసర్జన అవడం ఈ వ్యాధి లక్షణాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: