దేశంలో గత నాలుగు రోజుల నుంచి అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా పేరు వింటే చాలు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా భారీన పడి ప్రపంచవ్యాప్తంగా 17,000 మంది మృతి చెందారు. మన దేశంలో కరోనా విజృంభిస్తోంది. తెలంగాణలో 39 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
నిన్న ఒక్కరోజే తెలంగాణలో ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్రం ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి ఉంది. రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వారికి కరోనా సోకే అవకాశాలు తక్కువ. కరోనా సోకిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? అనే ప్రశ్న అందరిలోను ఆసక్తి రేపుతోంది. కరోనా బాధితులు ఉదయం సమయంలో కాఫీ, గోధుమ రవ్వ ఉప్మా, మినప వడ, ఇడ్లీ, దోసె ఆహారంగా తీసుకోవచ్చు. 
 
మధాహ్న భోజనంలో మిక్సిడ్ వెజిటేబుల్ కర్రీ, ఆకుకూరలు, గుడ్డు, సాంబారు, పెరుగు, అరటిపండు తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, పండ్లు, కాఫీ, టీ సాయంత్రం తీసుకోవాలి. రాత్రి వేళల్లో గుడ్డు, పప్పు, రసం, శాకాహారం తీసుకుంటే కరోనా నుండి త్వరగా బయటపడవచ్చు. కరోనా ముదిరితే బాధితులు ఆహారం తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: