మీరు వ్యాక్సిన్ వేయించుకున్నారా.. అయితే ఇంకేం పర్లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారా.. ఇక ఏం కాదులే అని హాయిగా ఉన్నారా... అయితే... మీ కోసమే ఈ వార్త. డెల్టా వేరియంట్ వైరస్ తప్పకుండా అటాక్ అవుతుందని.. శాస్త్రవేత్తలు వెల్లడించారు. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ... డెల్టా వైరస్ నుంచి తప్పించుకోవడం మాత్రం అసాధ్యం అంటున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం చేసే వారు డెల్టా వైరస్ వల్ల ఇబ్బందులు తప్పవన్నారు. అయితే ప్రాణాపాయం తక్కువగా ఉంటుందన్నారు శాస్త్రవేత్తలు. వ్యాక్సిన్ వల్ల శరీరంలో యాంటీ బాడీస్ పెద్ద ఎత్తున ఉంటాయని...  వీటి వల్ల వైరస్ వల్ల మరణించే శాతం తక్కువగా ఉంటుందన్నారు. అయితే డెల్టా వేరియంట్ వల్ల అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు.

డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు నిపుణులు. అటు వ్యాక్సిన్ డోస్ పూర్తి చేసుకోని వారిపై మాత్రం డెల్టా పెను ప్రభావం చూపుతుందంటున్నారు. దీని ప్రభావం ఇప్పటికే... యూకే, అమెరికాలో భారీగా ఉందన్నారు. రెండు డోసులు పూర్తి చేసుకున్నప్పటికీ... డెల్టా వేరియంట్ ఎటాక్ చేస్తుందని నిపుణులు వెల్లడించారు. అయితే మాస్క్, భౌతిక దూరం, శానిటైజేషన్ వంటి జాగ్రత్తలు పాటించిన వారిలో చాలా తక్కువ శాతం ఉందన్నారు. ఇప్పటికే బ్రిటన్ లో హాస్పిటలైజ్ అయిన 58 శాతం మందిలో 22 శాతం మంది వ్యాక్సినేషన్ డోస్ పూర్తి చేసుకున్న వారే అని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. అయితే... ఇది పెద్ద ప్రమాదకర స్థాయిలో లేదన్నారు. అటు కరోనా సోకిన వారిలో మరో ఆరు నెలల వరకు దాని ప్రభావం ఉంటుందని... అనారోగ్య సమస్యలు తప్పవంటున్నారు వైద్యులు. తప్పనిసరిగా సరైన పోషకాహారం తీసుకోవాలని.. వైద్యుల సలహాలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ... కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే అనే ఇప్పటికే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పష్టం చేసింది. సో బీ కేర్ ఫుల్.


మరింత సమాచారం తెలుసుకోండి: