ప్రజల నిర్లక్ష్య ధోరణి మరోసారి నిండా ముంచెత్తుగానే ఉంది. వచ్చేకొద్దీ అటు కేసులు, ఇటు మరణాలు పెరిగిపోతున్నాయి. కొత్త వేరియంట్ వలన ఈ ప్రభావం కాకపోయినా, గత పండుగ సీజన్ ప్రభావం ఇప్పుడు బయటపడుతుంది అనుకోవచ్చు. తాజా హెచ్చరికల నేపథ్యంలో అందరు జాగర్త వహించినప్పటికీ, ఇప్పటికే కాస్త వ్యాప్తి చెంది ఉండొచ్చు కనుక ప్రస్తుతం అవి బయటపడుతున్నట్టుగా ఉన్నాయి. ఇటీవల తగ్గినట్టుగా కనిపించిన కేసుల నమోదు ప్రస్తుతం పెరుగుతూ పోతుంది. ఇప్పటికి దాదాపుగా లక్ష వరకు యాక్టీవ్ కేసులు ఉండటమే ఈ ఆందోళనకు కారణం. గత 24 గంటలలో 8895 కేసులు కొత్తవి నమోదు అయ్యాయి. మరణాలు కూడా 2796గా ఉన్నాయి. అలాగే 6918 మంది వైరస్ నుండి బయటపడ్డారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు 99155గా ఉన్నాయి.

రోజువారీ కేసులలో ఇప్పటికి కేరళ నుండే సగంపైగా నమోదు అవుతున్నాయి. గత 24 గంటలలో ఆ రాష్ట్రంలో 4557 మంది కరోనా బారిన పడ్డారు. బీహార్ లో కూడా గత గణాంకాలతో పోలిస్తే ఇటీవల మరణాల రేటు పెరిగింది. తెలుగు రాష్ట్రాలలో కూడా కాస్త పెరుగుదల కనిపిస్తుంది. తెలంగాణాలో చూసుకుంటే, డిసెంబర్ నెలలో ఇప్పటివరకు రోజు వారి కేసులలో కాస్త పెరుగుదల(184-213) కనిపిస్తుంది. ఇక ఏపీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుండటంతో, కేంద్రం కూడా ముందస్తు హెచ్చరికలు జారీచేయడంతో అప్రమత్తంగానే ఉన్నారు అధికారులు.

దేశంలో ఇప్పటివరకు 34633255 మంది కరోనా బాధితులు అయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 473326గా ఉంది. కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 34060774గా ఉంది. ప్రస్తుతం యాక్టీవ్ కేసులు మొత్తం కేసులలో 0.29 శాతంగా ఉన్నాయి. సానుకూలత రేటు 0.73శాతంగా ఉంది.  గత రెండు నెలలలో ఇది 2 శాతం కంటే తక్కువగానే ఉంది. వారానికి పోలిస్తే, పాజిటివ్ రేటు 0.8 గా ఉంది. ఇది గత నెలరోజులుగా 1 శాతం కంటే తక్కువగానే ఉంటుంది. కరోనా తగ్గిపోతున్న రేటు 98.35 శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజే 1226064 పరీక్షలు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: